Share News

RCB vs KKR Match: ఫ్యాన్స్‌కు పండగే.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:32 PM

IPL 2025 Live Streaming: ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి ఆర్సీబీ-కేకేఆర్. ఈ రెండు కొదమసింహాల నడుమ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఫస్ట్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందా.. లేదా.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం.

RCB vs KKR Match: ఫ్యాన్స్‌కు పండగే.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్
Eden Gardens Weather Report

ఐపీఎల్-2025 ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, క్రేజీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే ఫస్ట్ ఫైట్‌‌తో టోర్నీ మొదలవనుంది. అయితే ఈ మ్యాచ్‌ జరుగుతుందా.. లేదా.. అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)లో వర్షం పడుతుందనే సూచనలే దీనికి కారణంగా చెప్పాలి. అయితే టెన్షన్ అక్కర్లేదు.. రెయిన్‌పై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


టెన్షన్ అక్కర్లేదు

క్రికెల్ లవర్స్‌కు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉండదని చెప్పింది. ఆల్రెడీ ఈడెన్ గార్డెన్స్‌లోకి ప్రేక్షకుల రాక కూడా మొదలైపోయింది. గత కొన్ని రోజులుగా కోల్‌క‌తా రెగ్యులర్‌గా వాన కురుస్తోంది. దీంతో శనివారం కూడా వర్షం పడటం ఖాయం.. మ్యాచ్‌పై రెయిన్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ భయపడ్డారు. అందుకు తగ్గట్లే శనివారం ఉదయం వరకు నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో మ్యాచ్ జరగదేమోనని అంతా టెన్షన్ పడ్డారు. అయితే వెదర్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షం పోయి ఎండ రావడంతో అటు కోల్‌కతా, ఇటు బెంగళూరు అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సాయంత్రం బాలీవుడ్ సెలెబ్రిటీల పాటలు, డ్యాన్సుల సందడి.. ఆ తర్వాత బరిలో కొదమసింహాల్లాంటి ఆటగాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ కొట్లాటను చూసేందుకు రెడీ అయిపోతున్నారు.


ఇవీ చదవండి:

ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్.. ఆర్సీబీదే పైచేయా..

RCB vs KKR ఫస్ట్ ఫైట్.. ప్లేయింగ్ 11 రివీల్డ్

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. టోర్నీ ఓపెనర్‌‌లో గెలుపెవరిది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2025 | 01:40 PM