Rishabh Pant-Sanjiv Goenka: పంత్ వర్సెస్ లక్నో ఓనర్.. కేఎల్ రాహుల్‌కు జరిగిందే..
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:53 AM
IPL 2025: లక్నో సూపర్ జియాంట్స్ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను పోగొట్టుకుంది. ఒకే ఒక్కడి పోరాటం వల్ల పంత్ సేన గెలుపు ముంగిట బోల్తా పడింది. దీంతో ఆ టీమ్ ఓనర్ సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్‌లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఒక్కో టీమ్ యజమాని తమ ఆటగాళ్లతో ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు ప్లేయర్ల మీద భరోసా ఉంచి.. వాళ్లను స్వేచ్ఛగా ఆడేలా చేస్తారు. సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ కూడా అదే కోవలోకి వస్తారు. జట్టు ఓడిపోతే కావ్యా పాప ఎంత ఎమోషనల్ అవుతారో తెలిసిందే. అయితే కొన్ని ఫ్రాంచైజీల యజమానులు మాత్రం ఆటగాళ్లపై సీరియస్ అవుతారు. లక్నో సూపర్ జియాంట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా గతేడాది అదే చేశారు. టీమ్ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద ఆయన గుస్సా అయ్యారు. అందరి ముందే రాహుల్‌ను చీవాట్లు పెట్టారు. అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది. ఆయన చేతుల్లో ఈసారి బలయ్యాడు రిషబ్ పంత్. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
పంత్‌ను పిలిచి..
ఐపీఎల్ తాజా సీజన్‌ను లక్నో జట్టు ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 1 వికెట్ తేడాతో మట్టికరిచింది. ఆఖరి వరకు ఎల్‌ఎస్‌జీ చేతుల్లోనే మ్యాచ్ ఉంది. కానీ అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్) ఫైటింగ్‌తో గెలుపు లక్నో చేజారింది. దీంతో అప్పటివరకు తమదే విజయమంటూ ధీమాతో ఉన్న ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా ఓటమి బాధ తట్టుకోలేకపోయాడు. వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్‌ను పిలిచి మాట్లాడాడు. అలాగే కోచ్ జస్టిన్ లాంగర్‌తోనూ సీరియస్‌గా ఏదో చెబుతూ కనిపించాడు.
నమ్మాలి సార్..
లాస్ట్ ఐపీఎల్ టైమ్‌లో కేఎల్ రాహుల్‌తో మాట్లాడినంత సీరియస్‌గా కాకపోయినా ఈసారి కూడా సంజీవ్ గోయెంకా కాస్త గంభీరంగానే కనిపించాడు. దీంతో గతేడాది ఏం జరిగిందో అదే రిపీట్ అవుతోందని.. లక్నోకు మరిన్ని ఓటములు ఎదురైతే రాహుల్‌కు జరిగిందే పంత్ విషయంలోనూ పునరావృతం అవడం ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే జరిగితే వచ్చే సీజన్‌కు మళ్లీ కెప్టెన్‌ను మార్చేస్తారా.. పంత్ ఇంకో టీమ్‌కు వెళ్లక తప్పదా అని సెటైర్స్ వేస్తున్నారు. సంజీవ్ తీరు మారనంత వరకు లక్నోకు కప్పు రాదని అంటున్నారు. అప్పట్లో రైజింగ్ పూణె సూపర్‌జియాంట్స్ టీమ్‌కు ఓనర్‌గా ఉన్నప్పుడు ఇలాగే ధోనీని తప్పించి స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్ చేశాడని గుర్తుచేస్తున్నారు. గతేడాది వైఫల్యానికి రాహుల్‌ను బలిచేశాడని.. ఇప్పుడు పంత్‌కు అదే పరిస్థితి కల్పిస్తున్నారని సీరియస్ అవుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని.. టీమ్‌పై నమ్మకం ఉంచాలంటూ లక్నో యాజమాన్యానికి సూచనలు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి