IPL 2025 Pat Cummins SRH: ప్రత్యర్థులకు కమిన్స్ వార్నింగ్.. దమ్ముంటే ఆపండి చూద్దాం..
ABN , Publish Date - Mar 23 , 2025 | 02:54 PM
RR vs SRH 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. లాస్ట్ టైమ్ అయిన తప్పులు రిపీట్ కాకుండా.. ఈసారి కప్పును ఎగరేసుకుపోవాలని చూస్తోంది కమిన్స్ సేన.

ఐపీఎల్-2025 ట్రోఫీని గెలుచుకొని తీరాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్. గతేడాది ఫైనల్ వరకు వచ్చినా తృటిలో కప్పు చేజార్చుకుంది ఆరెంజ్ ఆర్మీ. ఈసారి అలాంటి తప్పులకు చాన్స్ ఇవ్వొద్దని చూస్తోంది. అదే టైమ్‌లో చాన్నాళ్లుగా ఉన్న ఓ టార్గెట్‌ను కూడా రీచ్ అవ్వాలని పంతంతో ఉంది. అదే 300 పరుగుల లక్ష్యం. ఈసారి దీన్ని అందుకొంటామని ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశాడు. ఆరెంజ్ ఆర్మీ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొన్న అతడు.. దమ్ముంటే ఆపమంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
కొట్టి చూపిస్తాం
గత సీజన్‌లో 300 పరుగుల మార్క్‌కు దగ్గరగా వచ్చి ఆగిపోయామని.. కానీ ఈసారి ఆ ఘనత అందుకుంటామని ఆశిస్తున్నానని కమిన్స్ తెలిపాడు. ఆడుతూ పోతే రికార్డులు అవే బ్రేక్ అవుతాయని చెప్పాడు. లాస్ట్ సీజన్‌లో ఆడినట్లే ఈసారి కూడా ఫియర్‌లెస్ అప్రోచ్‌తోనే ఆడతామని క్లారిటీ ఇచ్చాడు ఎస్‌ఆర్‌హెచ్ సారథి. తన పక్కనే కూర్చున్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మను చూస్తూ.. ఈసారి 300 సాధ్యమే అంటూ 3 వేళ్లు చూపించాడు కమిన్స్. దీంతో ఫ్యాన్స్ ఈలలు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. హెడ్ కోచ్ డానియల్ వెటోరి కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. కాగా.. గత సీజన్‌లో సన్‌రైజర్స్ రెండుసార్లు 300 స్కోరుకు చేరువ దాకా వచ్చింది. ఒకసారి 277, మరో ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటిదాకా ఏ టీమ్ అందుకోని 300 రన్స్ మార్క్‌ను కమిన్స్ సేన రీచ్ అవుతుందేమో చూడాలి.
ఇవీ చదవండి:
నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. వాళ్లు లాక్కెళ్తారు: ధోనీ
ఉప్పల్‌లో బ్లాక్ టిక్కెట్ల దందా.. పోలీసులను చూసి..
ఆఫర్లతో ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి