SRH vs LSG IPL Match: ఉప్పల్‌లో కొడితే బోడుప్పల్‌లో పడాలె.. ఇక నరకమే
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:23 PM
Today IPL Match: ఐపీఎల్ నయా సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే తనదైన స్టైల్‌లో బోణీ కొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇదే ఊపులో నెక్స్ట్ మ్యాచ్‌లో అపోజిషన్ టీమ్ మీద మరింతగా విరుచుకుపడాలని ప్లాన్ చేస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉంటాయి. కొన్ని జట్లు తమకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే టీమ్స్‌తో పోటీపడినప్పుడు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఉదాహరణకు ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్. అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్. కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్. ఇలా కొన్ని జట్ల మధ్య మ్యాచులు యుద్ధాన్ని తలపిస్తాయి. ఇప్పుడు అలాంటి మ్యాచ్‌కు అంతా సిద్ధమవుతోంది. అదే సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జియాంట్స్ పోరు. బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూసుకుంటే నార్మల్ మ్యాచే.. కమిన్స్ సేనదే పైచేయి అని అనుకోవచ్చు. కానీ గతంలో ఆరెంజ్ ఆర్మీపై లక్నోకు మంచి రికార్డు ఉంది. ఆ లెక్కన ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ముఖ్యమైన బ్యాటిల్స్‌లో ఇదొకటి.
బడితపూజ తప్పదు
సన్‌రైజర్స్-లక్నో జట్ల మధ్య ఇప్పటివరకు 5 మ్యాచులు జరిగాయి. ఇందులో మూడింట ఎల్‌ఎస్‌జీ, రెండు మ్యాచుల్లో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించాయి. ఈ ఇరు జట్లు తలపడిన తొలి మూడు మ్యాచుల్లో గెలుపు లక్నోదే. కానీ గత సీజన్‌లో పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. వరుసగా రెండు సార్లు ఎల్‌ఎస్‌జీని చిత్తు చేసింది. మార్చి 27న ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ కొదమసింహాల మధ్య కొట్లాట జరగనుంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి లక్నోకు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల చేతుల్లో బడితపూజ తప్పదని అంటున్నారు. కాటేరమ్మ కొడుకులు ఉప్పల్‌లో కొడితే బంతి.. బోడుప్పల్‌లో పడాల్సిందేనని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక నరకమే..
చివరగా ఐపీఎల్-2024లో లక్నో-హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎల్‌ఎస్‌జీ సంధించిన 165 పరుగుల టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్ వికెట్లేమీ కోల్పోకుండా 9.4 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్) ప్రత్యర్థికి విశ్వరూపం చూపించాడు. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్) కూడా అపోజిషన్ బౌలర్లకు నరకం చూపించాడు. ఈసారి వీళ్లకు తోడు నితీష్ రెడ్డి, క్లాసెన్, సెంచరీ హీరో ఇషాన్ కిషన్ లాంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. అందుకే రేపటి మ్యాచ్‌లో మన టీమ్ 300 రన్స్ మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని.. అసలే వీక్‌గా ఉన్న లక్నో బౌలింగ్‌కు ఇంక చుక్కలేనని చెబుతున్నారు నెటిజన్స్. కాటేరమ్మ కొడుకులు కొట్టే కొట్టుడుకు అపోజిషన్ టీమ్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనపడాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్లీజ్.. రోహిత్‌ను ఏమీ అనొద్దు: సిరాజ్
అయ్యర్‌నే పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు
కావాలనే సెంచరీ మిస్.. అయ్యర్‌కు హ్యాట్సాఫ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి