Share News

IPL 2025 Nitish Kumar Reddy: కోపం తట్టుకోలేకపోయిన నితీష్.. తెలుగోడ్ని ఇంత సీరియస్‌గా చూసుండరు

ABN , Publish Date - Mar 28 , 2025 | 10:29 AM

SRH vs LSG: ఐపీఎల్ కొత్త సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తొలి ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్ జియాంట్స్‌తో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది కమిన్స్ సేన. దీంతో కోపం తట్టుకోలేకపోయాడు నితీష్ రెడ్డి.

IPL 2025 Nitish Kumar Reddy: కోపం తట్టుకోలేకపోయిన నితీష్.. తెలుగోడ్ని ఇంత సీరియస్‌గా చూసుండరు
Nitish Kumar Reddy

ఐపీఎల్-2025ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయింది. లక్నో సూపర్ జియాంట్స్‌తో ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది ఎస్‌ఆర్‌హెచ్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కమిన్స్ సేన.. ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను మరో 23 బంతులు ఉండగానే చేజ్ చేసేసింది లక్నో. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అటు ఆటగాళ్లు కూడా ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. తెలుగు తేజం నితీష్ రెడ్డి అయితే ఫ్రస్ట్రేషన్‌లో హెల్మెట్‌ను నేలకేసి బాదాడు. అసలు ఏం జరిగిందంటే..


బాధ తట్టుకోలేక..

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ మంచి స్టార్ట్ అందుకున్నాడు. 28 బంతుల్లో 32 పరుగులతో టచ్‌లో కనిపించాడు తెలుగోడు. అప్పటికే 2 బౌండరీలు బాదిన నితీష్.. ఇంకొన్ని షాట్లతో మరింత ఊపందుకోవాలని భావించాడు. అయితే స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బంతి లెంగ్త్‌ను అందుకోవడంలో మిస్ అయి వికెట్ పారేసుకున్నాడు. దీంతో ఆ కోపం తట్టుకోలేక డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో మెట్లపై హెల్మెట్‌ను విసిరేశాడు. కోపంతో ఊగిపోయిన నితీష్.. హెల్మెట్‌ను తీసి గట్టిగా నేలకేసి బాదాడు. ఇది చూసిన నెటిజన్స్.. కూల్, కూల్ ఏమీ కాదు.. ఒక్క మ్యాచ్‌తో పోయేదేమీ లేదని ధైర్యం నింపుతున్నారు. ఈ అగ్రెషన్‌ బ్యాటింగ్‌లో చూపించు తెలుగోడా అంటూ బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


ఇవీ చదవండి:

హిందీ కామెంట్రీ పేలవం!

జియోస్టార్ నుంచి నయా అప్డేట్..

మమ్మల్ని గుర్తించండి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2025 | 10:45 AM