Thaman S IPL 2025: ఉప్పల్ స్టేడియానికి థమన్.. దుమ్ములేపేలా మ్యూజికల్ నైట్
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:06 PM
Indian Premier League: ఐపీఎల్-2025 సీజన్ ఆరంభంలోనే హీటెక్కుతోంది. ఒకదాన్ని మించిన మరో పోరాటంతో లీగ్ మొదట్లోనే గట్టి కిక్ ఇస్తున్నాయి టీమ్స్. ఇదే క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు అంతా సిద్ధమవుతోంది. ఈ తరుణంలో అభిమానులకు అదిరిపోయే న్యూస్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ సూపర్ న్యూస్. ఆల్రెడీ కమిన్స్ సేన అదిరిపోయే ఆటను చూసి ఎంజాయ్ చేస్తున్న వారికి మరో శుభవార్త. ఈసారి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ల విధ్వంసంతో పాటు మరో అంశం కూడా వాళ్లను ఎంటర్‌టైన్ చేయనుంది. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఉప్పల్ స్టేడియానికి రానున్నాడు. బాక్సులు పలిగేలా మ్యూజిక్ ప్లే చేయనున్నాడు. మరి.. ఏ మ్యాచ్ కోసం థమన్ వస్తున్నాడు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎప్పుడంటే..
తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్.. సెకండ్ ఫైట్‌లో భాగంగా లక్నో సూపర్ జియాంట్స్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మార్చి 27వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలి రానున్నారు ప్రేక్షకులు. వాళ్లను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు థమన్ వస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఐపీఎల్‌కు హోస్ట్‌గా ఉన్న స్టేడియాల్లో మ్యాచులకు ముందు ఇవే తరహాలో సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్‌తో ఈవెంట్స్ నిర్వహిస్తోంది భారత క్రికెట్ బోర్డు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ముందు అనిరుధ్‌తో ఇలాగే మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఇప్పుడు ఉప్పల్‌లో థమన్‌తో సంబురాలను ప్లాన్ చేశారు. ఈ స్టార్ కంపోజర్ గ్రౌండ్‌కు వస్తే దుమ్మురేపడం ఖాయం. హిట్ సాంగ్స్‌తో ఆడియెన్స్‌కు కిక్ ఇవ్వడం పక్కా అని చెప్పొచ్చు. అటు ఆటగాళ్ల పోరాటాలు, ఇటు థమన్ మ్యూజిక్.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.
ఇవీ చదవండి:
పంత్ వర్సెస్ లక్నో ఓనర్.. ఏం జరిగిందంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి