SRH vs RR: సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్.. ఇది రాక్షసుల జాతర
ABN , Publish Date - Mar 23 , 2025 | 06:41 PM
SRH Second Highest Total: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే కాటేరమ్మ కొడుకులు పాత చరిత్రను తిరగరాశారు.

కాటేరమ్మ కొడుకులు మళ్లీ చెలరేగారు. గత సీజన్‌లో ఎలాగైతే విధ్వంసకాండ సృష్టించారో.. అదే రీతిలో ఐపీఎల్ నయా సీజన్‌లోనూ దుమ్మురేపారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కమిన్స్ సేన.. 20 ఓవరల్లో 286 పరుగులు చేసింది. ఐపీఎల్ హయ్యెస్ట్ స్కోరు రికార్డు 287 (ఐపీఎల్ 2024) పరుగులకు కేవలం ఒక్క రన్ దూరంలో ఆగిపోయింది. కొద్దిలో రేర్ రికార్డ్ మిస్ చేసుకుంది ఆరెంజ్ ఆర్మీ.
జస్ట్ మిస్
ఐపీఎల్‌లో టీమ్స్ పరంగా హయ్యెస్ట్ స్కోర్లు అన్నీ సన్‌రైజర్స్ పేరు మీదే ఉన్నాయి. లాస్ట్ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో 287 పరుగులు, ఇంకో మ్యాచ్‌లో 277 పరుగులు చేసింది కమిన్స్ సేన. తాజా సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే 286 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో హయ్యెస్ట్ రికార్డ్‌ను మిస్ అయింది. అయితే 277 స్కోరును మాత్రం అధిగమించింది. ఈ సీజన్‌లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఎస్ఆర్‌హెచ్ ఇంకా చాలా మ్యాచులు ఆడాల్సి ఉంది. కాబట్టి కమిన్స్ చెప్పినట్లు 300 కొట్టి తీరేలా కనిపిస్తున్నారు. అదే జరిగితే వరల్డ్ టీ20 క్రికెట్ హిస్టరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ న్యూ చాప్టర్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. దాన్ని బీట్ చేయడం కూడా అసాధ్యమే. మరి.. సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
ఇవీ చదవండి:
13 కోట్ల ఆటగాడి చెత్త రికార్డు
ఎస్‌ఆర్‌హెచ్ దెబ్బకు వాళ్లపై వాళ్లే మీమ్ వేసుకున్నారు
కావ్యా పాప నవ్వు కోసమైనా కప్పు కొట్టాల్సిందే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి