Kavya Maran: ఫుల్ హ్యాపీగా కావ్యా పాప.. ఈ నవ్వు కోసమైనా కప్పు కొట్టాల్సిందే
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:08 PM
IPL 2025 Live Score: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ మరోమారు ఎంటర్‌టైన్ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియంలో కావ్యా పాప తెగ సందడి చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతోందంటే చాలు.. వెంటనే అందరి ఫోకస్ కావ్యా పాప మీదకే వెళ్తుంది. ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ అయిన కావ్యా మారన్‌కు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్ ఉంటే కెమెరా కళ్లు కూడా ఆమె మీదే ఫోకస్ చేస్తాయి. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-సన్‌రైజర్స్‌కు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. అయితే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరగేడంతో ఆమె ఫుల్ హ్యాపీగా కనిపించింది. నవ్వుతూ సంతోషంలో మునిగిపోయింది. కావ్యా పాప స్మైల్‌తో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు మరింత చెలరేగిపోయారు.
కావ్యా పాపను చూసి..
ఒకవైపు ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 67), మరోవైపు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80 నాటౌట్) వరుసగా బౌండరీలు, సిక్సులతో విధ్వంసం సృష్టించారు. ఉప్పల్‌లో ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించారు. స్టాండ్స్‌లో కూర్చున్న కావ్యా పాప సపోర్ట్‌తో వాళ్లు మరింత చెలరేగారు. ఒక్కో బౌలర్‌ను టార్గెట్ చేసి మరీ ఉతికి ఆరేశారు. దీంతో కావ్యా పాప ముఖంలో చిరునవ్వు మరింత ఎక్కువైంది. ఈ టైమ్‌లో స్టేడియంలోని అభిమానులు ఈలలు, చప్పట్లతో రచ్చ రచ్చ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్.. ఎస్‌ఆర్‌హెచ్ అంటూ అరవసాగారు. ఇది చూసిన నెటిజన్స్.. కావ్యా పాప నవ్వు కోసమైనా కప్పు కొట్టాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం సన్‌రైజర్స్ 16 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులతో ఉంది. ఇషాన్ (80 నాటౌట్), క్లాసెన్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఇవీ చదవండి:
హెడ్ ఊచకోత.. బౌలర్లకు నిద్రలేకుండా చేశాడు
కోహ్లిని రింకూ సింగ్ అవమానించాడా
కమిన్స్ వార్నింగ్.. దమ్ముంటే ఆపమంటూ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి