Share News

SA20: ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి

ABN , Publish Date - Feb 07 , 2025 | 09:03 AM

Sunrisers Eastern Cape: సన్‌రైజర్స్ మరోమారు ఫైనల్స్‌కు చేరుకుంది. కావ్యా పాప జట్టు తగ్గేదలే అంటూ టైటిల్‌ ఫైట్‌కు క్వాలిఫై అయింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్ మరో కొప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

SA20: ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి
Sunrisers Eastern Cape

కావ్యా మారన్ టీమ్ మరోమారు అద్భుతం చేసింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి ఎస్‌ఏ 20 లీగ్ ఫైనల్‌కు చేరుకుంది. పార్ల్ రాయల్స్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఆ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంకో 4 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ఫినిష్ చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పార్ల్ రాయల్స్ జట్టు ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రిటోరియస్ (41 బంతుల్లో 59), రుబిన్ హెర్మన్ (53 బంతుల్లో 81) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన సర్‌రైజర్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ వచ్చింది.


పోటాపోటీగా హిట్టింగ్!

సన్‌రైజర్స్ ఓపెనర్ టోనీ డీ జోర్జీ (49 బంతుల్లో 78), జోర్డాన్ హెర్మన్ (48 బంతుల్లో 69 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు, సిక్సులు కొడుతూ అవతలి జట్టు బౌలర్లను ఆటాడుకున్నారు. ఆఖర్లో కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (12 బంతుల్లో 11 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించిన టోనీ జోర్జీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ఫైనల్ చేరిన కావ్యా పాప టీమ్.. కప్పు కోసం ఫిబ్రవరి 8వ తేదీన ముంబై ఇండియన్స్ కేప్‌డౌన్‌తో తలపడనుంది. మరి.. సన్‌రైజర్స్ వరుసగా రెండోసారి విజేతగా నిలిచి ఫ్యాన్స్‌ సంతోషాన్ని రెట్టింపు చేస్తుందేమో చూడాలి.


ఇవీ చదవండి:

‘ద హండ్రెడ్‌’ జట్టును కొన్న ‘సన్‌రైజర్స్‌’

‘సన్‌రైజర్స్‌’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌ విధానం

ఆసియా వింటర్‌ గేమ్స్‌కు చంద్ర

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 09:11 AM