SRH New Anthem 2025: సన్‌రైజర్స్ కొత్త యాంథమ్.. లిరిక్స్ వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ
ABN , Publish Date - Mar 23 , 2025 | 02:23 PM
SRH Team 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ కొత్త సీజన్‌లో వేటకు సిద్ధమవుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు తమ యాంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.

ఐపీఎల్-2025 హీటెక్కుతోంది. కొత్త సీజన్ రెండో రోజే భీకర పోరాటాలు జరుగుతున్నాయి. టోర్నీ ఫేవరెట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా బరిలోకి దిగుతోంది. తెలుగు జట్టు సన్‌రైజర్స్ ఇవ్వాళ రాజస్థాన్‌తో పోటీపడుతోంది. గత సీజన్‌లో తృటిలో చేజారిన కప్పును ఈసారి అస్సలు వద్దలొద్దని అనుకుంటున్న కమిన్స్ సేన.. తొలి మ్యాచ్ నుంచే దూసుకెళ్లాలని చూస్తోంది. సరిగ్గా ఫస్ట్ మ్యాచ్‌కు ముందు ఫ్యాన్స్‌కు కిక్కిస్తూ యాంథమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసింది. ఇందులోని లిరిక్స్, మ్యూజిక్ వింటే గూస్‌బంప్స్ పక్కా అనే చెప్పాలి. ఈ యాంథమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
చెప్పి మరీ తాట తీస్తామే..
పక్కా ఇంకో రేంజ్ బ్రో.. అంటూ సన్‌రైజర్స్ యాంథమ్ సాంగ్ మొదలవుతుంది. సుర్రా.. సుర్ పటాసులే.. గిర్రా గిర్ గిల్లాటులే అంటూ ఈ పాట సాగుతుంది. బ్యాట్ పట్టాలే.. సిక్స్ కొట్టాలే అంటూ సాంగ్ ఊపందుకుంటుంది. ఆరెంజ్ ఆర్మీ.. అంటే సునామీ.. చెప్పి మరీ తాట తీస్తామే అంటూ అటు లిరిక్స్, ఇటు ట్యూన్‌తో సాగే యాంథమ్ అదిరిపోయింది. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఈ పాటలో తెగ సందడి చేశారు. అపోజిషన్ టీమ్స్‌కు మాస్ వార్నింగ్ ఇస్తూ కనిపించారు. ఇంటెన్స్ లుక్స్‌తో అలరించారు. ఈ సాంగ్ ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో జోష్ డబుల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
SRH vs RR మ్యాచ్.. ఊహించని ట్విస్ట్
ఆఫర్లతో ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి