Share News

Varun Chakaravarthy: భారత్‌కు వస్తే చంపేస్తామని బెదిరించారు.. వరుణ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 15 , 2025 | 10:48 AM

IPL 2025: టీమిండియా క్రేజీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ట్రంప్ కార్డ్‌గా ఉపయోగపడ్డాడీ మిస్టరీ స్పిన్నర్. ఐపీఎల్-2025లోనూ దుమ్మురేపాలని చూస్తున్నాడు.

Varun Chakaravarthy: భారత్‌కు వస్తే చంపేస్తామని బెదిరించారు.. వరుణ్ సంచలన వ్యాఖ్యలు
Varun Chakaravarthy

ఒక్క టోర్నమెంట్‌తో టీమిండియాకు కొత్త హీరోగా అవతరించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ భారత్ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి వరుణ్‌ చేతికి బంతి ఇస్తూ ఫలితం సాధించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడ్ని ట్రంప్ కార్డుగా వాడుకొని ప్రత్యర్థుల పనిపట్టాడు. చాన్నాళ్లు టీమ్‌కు దూరమై ఇబ్బందులు పడిన వరుణ్.. చాంపియన్స్ ట్రోఫీతో టీమ్‌లో తన స్పాట్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే ఊపులో ఐపీఎల్-2025లోనూ అదరగొట్టాలని చూస్తున్నాడు. అలాంటోడు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


బైకులపై వెంటపడుతూ..

భారత్‌కు వస్తే చంపేస్తామనని తనను బెదిరించారని అన్నాడు వరుణ్ చక్రవర్తి. టీ20 వరల్డ్ కప్-2021 తర్వాత తాను భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పాడు మిస్టరీ స్పిన్నర్. అవి తన జీవితంలో చీకటి రోజులని తెలిపాడు. ఇండియాకు వచ్చే ధైర్యం చేస్తే మిగలవని వార్నింగ్ ఇచ్చారని అతడు గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో భయపడి దాక్కోవాల్సి వచ్చిందన్నాడు. కొందరైతే తనను బైక్ మీద ఫాలో అయి భయపెట్టారన్నాడు. దీంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని పేర్కొన్నాడు. ఆ తర్వాత కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నించినా తనను సెలెక్టర్లు పట్టించుకోలేదన్నాడు. టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కంటే రీఎంట్రీ కష్టమనేది అర్థమైందన్నాడు.


అన్నీ మార్చేశా..

‘టీ20 వరల్డ్ కప్-2021 వైఫల్యం తర్వాత నన్ను నేను ఎంతో మార్చుకున్నా. డైలీ రొటీన్ దగ్గర నుంచి ప్రాక్టీస్ వరకు చాలా విషయాల్లో చేంజెస్ చేయాల్సి వచ్చింది. ఒక సెషన్‌లో 50 బంతులు వేసేవాడ్ని. కానీ ఆ తర్వాత దాన్ని డబుల్ చేశా. అయితే ఎంత బాగా ఆడినా సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. అలా మూడేళ్లు గడిచాయి. దీంతో నేను ఆశలు వదులుకున్నా. కానీ కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడం, నేను ఆ సీజన్‌లో రాణించడంతో టీమిండియాలోకి కమ్‌బ్యాక్ చాన్స్ ఇచ్చారు’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు.


ఇవీ చదవండి:

ముంబై తొలిపోరుకు హార్దిక్‌ దూరం

అక్షర్‌కు ‘ఢిల్లీ’ పగ్గాలు

బుమ్రా వచ్చేదెప్పుడో!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2025 | 10:50 AM