IPL 2025: CSKపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు..వీడియో వైరల్
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:57 PM
నిన్న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2025(IPL 2025)లో మూడో మ్యాచ్ నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. కానీ మ్యాచ్ సమయంలో చెన్నై ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఏముందంటే..
వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను ఏదో సైగ చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఆ క్రమంలో ఖలీల్ అహ్మద్ తన ప్యాంటు జేబులోంచి ఏదో తీస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే, రుతురాజ్ గైక్వాడ్ కూడా అతనికి ఏదో ఇచ్చిన తర్వాత, అతను దానిని తన జేబులో ఉంచుకున్నాడు. ఇది ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన రహస్య సంభాషణగా అనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కోడుతోంది.
అసలు ఏం ఇచ్చాడు..
ఈ వీడియో ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ వీడియో చూసిన అనేక మంది ఈ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. రుతురాజ్‌కు పేసర్ ఖలీల్ అహ్మద్ ఇసుక లాంటి అట్ట ముక్క ఇచ్చాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ ఇసుక అట్టను బంతిపై రుద్దడం వల్ల బంతి బౌలర్లకు సహాయపడుతుందని అంటున్నారు. ఇది ఫాస్ట్ బౌలర్ల బంతిని స్వింగ్ చేయడానికి సులభతరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చెన్నైపై రెండేళ్ల వేటు తప్పదా..
ఈ ఆరోపణల నేపథ్యంలో ఐపీఎల్ బోర్డ్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే గతంలో ఇలాంటి ఫిక్సింగ్ ఆరోపణలపై 2 సంవత్సరాల నిషేధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు అదే చెన్నై జట్టుపై మళ్ళీ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై చెన్నై ఫ్రాంచైజీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఇది చూసిన నెటిజన్లు మాత్రం చెన్నైకి మరో రెండేళ్ల వేటు తప్పదని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News