Share News

KKR vs RCB IPL 2025 Live: కేకేఆర్-ఆర్సీబీ.. హోరాహోరీ పోరులో విజయం ఎవరిదో..

ABN , First Publish Date - Mar 22 , 2025 | 04:29 PM

IPL 225 Live Updates in Telugu: ఐపీఎల్ సీజన్ 18 ధమాకా మొదలైంది. 10 జట్లు.. 74 మ్యాచ్‌లు 65 రోజులు మోత మోగనుంది. ప్రతి రోజూ ప్రతి మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మ్యాచ్ ప్రిడిక్షన్ మొదలు.. హైలెట్స్ వరకు ప్రతీ విషయాన్ని క్షణకాలంలో మీకు అందిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ అప్‌డేట్స్‌ కోసం ఆంధ్రజ్యోతిని నిరంతరం చూస్తూ ఉండండి..

KKR vs RCB IPL 2025 Live: కేకేఆర్-ఆర్సీబీ.. హోరాహోరీ పోరులో విజయం ఎవరిదో..
KKR vs RCB IPL 2025

Live News & Update

  • 2025-03-22T22:56:26+05:30

    ఆర్సీబీ ఘన విజయం..

  • 2025-03-22T22:10:34+05:30

    ఆర్సీబీ జోరుకు కళ్లెం..

    • ఫిల్ సాల్ట్ ఔట్

  • 2025-03-22T21:51:57+05:30

    ఇదేం దంచుడు సామీ.. వీర కొట్టుడు కొడుతున్న ఫిల్ సాల్ట్..

    • ఫిల్ సాల్ట్ 19 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

    • ఇక విరాట్ కోహ్లీ తానేం తక్కువ అంటూ 5 బంతుల్లోనే 12 పరుగులు బాదాడు.

    • ఆర్బీబీ స్కోర్ 5 ఓవర్లు ముగిసే సమయానికి 75 పరుగులు.

  • 2025-03-22T21:39:23+05:30

    కోహ్లీ వీరవిహారం.. 2 ఓవర్లకే 17 పరుగులు..

  • 2025-03-22T21:22:31+05:30

    కోల్‌కతా బ్యాటింగ్..

    డీకాక్ - 4 పరుగులు

    నరైన్ - 44

    రహానే - 56

    అయ్యర్ - 6

    రఘువంశీ - 30

    రింకూ సింగ్ - 12

    రస్సెల్ - 4

    రమన్ దీప్ సింగ్ - 6

    రానా - 5

    జాన్సన్ - 1

    ఆర్సీబీ బౌలింగ్..

    హాజెల్‌వుడ్ - 2

    దయాల్ - 1

    ఆర్ఎస్ దార్ - 1

    పాండ్యా - 3

    శర్మ - 1

  • 2025-03-22T21:18:23+05:30

    ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..

    • ఐపీఎల్ సీజన్ 18లో తొలి మ్యాచ్ కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరిగింది.

    • మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

    • ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేకేఆర్ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

    • 175 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

  • 2025-03-22T20:52:25+05:30

    ఆర్సీబీ దూకుడు.. కేకేఆర్ ఫసక్..

    • ఆర్సీబీ బౌలర్ల దూకుడు ముందు కేకేఆర్ బ్యాటర్లు బేజారవుతున్నారు.

    • వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు.

    • అజింక్య రహానే, సునీల్ నరైన్ తొలుత స్ట్రాంగ్‌గా నిలబడినా.. ఆ తరువాత సీన్ మారిపోయింది.

    • సునీల్ ఔట్ అయిన తరువాత అందరూ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు.

    • కేకేఆర్ 6వ వికెట్ కోల్పోయింది.

  • 2025-03-22T20:41:33+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్..

    • క్రునాల్ పాండ్య బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్ ఔట్ అయ్యాడు.

    • అయ్యర్ ఆరు పరుగులు చేశాడు.

  • 2025-03-22T20:29:19+05:30

    రహానే ఔట్..

    • సునీల్ నరైన్ తరువాత అజింక్య రహానే కూడా ఔట్ అయ్యాడు.

    • క్రునాల్ పాండ్య వేసిన 10వ ఓవర్ 3వ బంతికి రహానే ఔట్ అయ్యాడు.

    • కేకేఆర్ స్కోర్ ప్రస్తుతం 110-3/11 ఓవర్లు.

  • 2025-03-22T20:24:31+05:30

    రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. ఎవరు ఔట్ అయ్యారంటే..

    • కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ మరో వికెట్ కోల్పోయింది.

    • సునీల్ నరైన్ రెండో వికెట్‌గా ఔట్ అయ్యాడు.

    • కీపర్ క్యాచ్ పట్టడంలో నరేన్ పెవిలియన్ బాటపట్టాడు.

    • సునీల్ నరేన్ 44 పరుగులు చేశాడు.

  • 2025-03-22T20:21:39+05:30

    హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రహానే..

    • కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే దుమ్మురేపుతున్నాడు.

    • హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 2025-03-22T20:03:13+05:30

    ఫుల్ స్వింగ్‌లో కేకేఆర్ కెప్టెన్ రహానే..

    • రహానే ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు.

    • వరుసపెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదేస్తున్నాడు.

    • 15 బంతుల్లో 38 పరుగులు చేశాడు.

    • ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 60-1

  • 2025-03-22T19:36:59+05:30

    ఫస్ట్ మిస్ అయినా.. ఆ వెంటనే ఔట్..

    డికాక్ ఔట్..

  • 2025-03-22T19:35:19+05:30

    • కేకేఆర్ ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ వచ్చారు.

  • 2025-03-22T19:32:05+05:30

    ఐపీఎల్ సీజన్ 18లో ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.

    • టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది.

    • కోల్‌కతా టీమ్ బ్యాటింగ్‌కు దిగింది.

  • 2025-03-22T19:18:22+05:30

    టాస్ గెలిచిన ఆర్సీబీ..

    • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్ టాస్ గెలిచింది.

    • టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది.

    IPL-Toss.jpg

  • 2025-03-22T19:02:14+05:30

    ట్రోఫీతో స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్‌సీబీ, కేకేఆర్ కెప్టెన్స్..

    మరికాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఐపీఎల్ ట్రోఫీతో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. షారూక్ ఖాన్.. వీరిద్దరినీ స్టేడియంలోకి ఆహ్వానించారు.

  • 2025-03-22T18:56:22+05:30

    స్టేజ్‌ని షేక్ చేసిన కరణ్ ఔజ్లా..

    కరణ్ ఔజ్లా తన స్టైల్, స్వాగ్‌తో ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌లో దుమ్మురేపాడు. తన ఆట పాటతో స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

    IPL-Celebrations.jpg

  • 2025-03-22T18:51:16+05:30

    వేదికపై షారూక్, కోహ్లీ..

    ఐపీఎల్ సెలబ్రేషన్స్‌ వేదికపై షారూక్ ఖాన్, విరాట్ కోహ్లీ సందడి చేశారు.

  • 2025-03-22T18:17:37+05:30

    ఐపీఎల్ ఓపెనింగ్ సంబరాలు మొదలయ్యాయి.

    Sharuk-2.jpg

    బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్టేట్ పై ఫర్ఫార్మెన్స్ చేయబోనే సెలబ్రిటీస్ పేర్లను ప్రకటించారు. సింగర్ శ్రేయా ఘోషల్ మెస్మరైజింగ్ వాయిస్‌తో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

  • 2025-03-22T17:40:32+05:30

    అనిరుద్ రెడీ.. మీరు రెడీనా..

    Anirudh.jpg

    ఐపీఎల్ 2025 స్టేజ్‌ని దుమ్ములేపడానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సిద్ధంగా ఉన్నాడు. అతని రాకకోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అనిరుద్ ఆట పాట.. ఐపీఎల్‌కు మంచి జోష్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • 2025-03-22T17:27:54+05:30

    ఐపీఎల్ ప్రారంభానికి ముందు కీలక అప్‌డేట్..ఆయన పేరు తొలగింపు

    ఐపీఎల్ 2025 మ్యాచ్‌ ప్రారంభానికి ముందే అభిమానులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కామెంట్రీ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ పేరు తొలగించినట్లు తెలిసింది. అయితే ఎందుకు అలా జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-03-22T17:15:36+05:30

    KKR vs RCB IPL 2025 Live: కోల్‌కతాపై ఆర్బీబీ ట్రాక్ రికార్డ్ ఇదీ..

    • కోల్‌కతాపై ఆర్బీబీకి చెత్త ట్రాక్ రికార్డ్ ఉంది.

    • కేకేఆర్‌తో జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఓడిపోయింది.

    • ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన 13 మ్యాచ్‌లలో ఆర్సీబీ కేవలం 5 విజయాలు మాత్రమే సాధించింది.

    • మరి రాజత్ పటీదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ టీమ్ విజయం సాధిస్తుందా.. లేక గత ట్రాక్ రికార్డునే కొనసాగిస్తుందా.

    KKR-vs-RCB.jpg

  • 2025-03-22T17:10:54+05:30

    KKR vs RCB IPL 2025: కేకేఆర్ అంచనా జట్టు..

    సునిల్ నరైన్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

  • 2025-03-22T16:48:39+05:30

    రోహిత్ శర్మ గ్లౌవ్స్‌పై లెటర్స్.. మీనింగ్ అదేనా..

    ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కొత్త సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్నాడు. మరి.. ఏంటా సెంటిమెంట్.. అందులోని స్పెషాలిటీ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-03-22T16:46:08+05:30

    షారూక్ ఖాన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..

    Sharuk-Khan.jpg

  • 2025-03-22T16:46:07+05:30

    RCBs Predicted XI: ఆర్సీబీ ప్లెయింగ్ 11 టీమ్..

    ఆర్‌సీబీ ప్లెయింగ్ 11 ప్రిడిక్షన్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్, యష్ దయాల్

  • 2025-03-22T16:29:55+05:30

    Kolkata Weather Updates and KKR vs RCB IPL 2025: ఈడెన్ గార్డెన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదీ..

    క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఎక్కడ వాన వస్తుందో అని భయపడిన అభిమానుల బాధను సూర్యుడు అర్థం చేసుకున్నట్లు్న్నాడు. కోల్‌కతాలో సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. వర్షం ఆనవాళ్లే లేవు. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్ జరుగనుంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లోనే వర్షం కురవడంతో.. ఆగిపోయింది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా.. రద్దవుతుందా అని ఆందోళన వ్యక్తం చేశారు క్రికెట్ అభిమానులు. కానీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

    Kolkata-IPL-Match.jpg