Share News

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీ ఎప్పుడంటే..

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:37 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మార్చి 14 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు టోర్నమెంట్ తేదీని పొడిగించారు. ఐపీఎల్ 2025 తదుపరి సీజన్ తేదీని మార్చినట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీ ఎప్పుడంటే..
IPL 2025 Schedule Changes

IPL 2025 గురించి కీలక ప్రకటన వెలుగులోకి వచ్చింది. మార్చి 14 నుంచి మొదలు కావాల్సిన ఐపీఎల్ టోర్నీ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ తదుపరి సీజన్ తేదీలను మార్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఇప్పుడు IPL 2025 మార్చి 23 నుంచి ప్రారంభమవుతుందన్నారు. కానీ ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్ తేదీ గురించి ఇంకా ప్రకటించలేదు. ఐపీఎల్ కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.


త్వరలో మరిన్ని అంశాలపై..

ఇటీవల ముంబై ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇప్పుడు తదుపరి సమావేశం జనవరి 18 లేదా 19న నిర్వహించవచ్చు. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి టీమిండియా జట్టును ఖరారు చేయనున్నారు. దీంతో పాటు ఐపీఎల్‌కు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం IPL 2025 తేదీని మార్చి 23కి మార్చారు. దీంతో ఈ టోర్నీ ఇప్పుడు కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది.


కారణమిదేనా..

వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. కాగా టోర్నీలో తొలి సెమీఫైనల్ మార్చి 4న, రెండో సెమీఫైనల్ మార్చి 5న జరగనుంది. ఇది జరిగిన వెంటనే మార్చి 14 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ క్రమంలో ఆటగాళ్లకు పెద్దగా విరామం లభించడం లేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మార్చిలో పాకిస్థాన్, యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌లో పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. అందువల్ల వారికి కూడా విశ్రాంతి లభించదు. అందుకే ఐపీఎల్ ప్రారంభ తేదీని మార్పు చేసినట్లు తెలుస్తోంది.


IPL 2025 తేదీని ఎందుకు మార్చారు..

ఐపీఎల్ ప్రారంభ తేదీని ఎందుకు మార్చారనే దానిపై అధికారిక సమాచారం రాలేదు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ కూడా ఇంకా విడుదల కాలేదు. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ మెగా వేలం జెడ్డాలో జరిగింది. ఇందులో రిషబ్ పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..


Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 12 , 2025 | 05:46 PM