IPL 2025 Best Fantasy Team: విశాఖలో రెచ్చిపోయేది వీళ్లే టుడే బెస్ట్ ప్యాంటసీ టీమ్ ఇదేనా
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:29 AM
ల్లీ జట్టులో కెఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్మ్ వంటి బ్యాటర్లు ఉండగా అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్ ఈ జట్టుకు బలంగా చెప్పుకోవచ్చు. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ వంటి సమర్థ బౌలర్లు ఉన్నారు.

ఐపీఎల్ 18వ సీజన్‌లో సోమవారం (మార్చి 24)న విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లలో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో తమ మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. విజయంతో ట్రోర్నిని ప్రారంభించాలనే కసితో ఇరుజట్ల ఆటగాళ్లు కనిపిస్తున్నారు. రెండు జట్లకు కొన్ని బలాలుంటే, బలహీనతలు కూడా ఉన్నాయి.
ఒకరి బ్యాటింగ్ లైనఫ్ అద్భుతంగా ఉంటే మరో టీమ్ బౌలింగ్ లైనఫ్ బాగుంది. ఇవాళ రెండు జట్లలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. రెండు జట్లలో ఆటగాళ్ల ఆధారంగా కొందరు నిపుణులు అంచనా వేసిన టుడే బెస్ట్ ఫ్యాంటసీ టీమ్ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రెండు జట్లలో కలిపి 22 మంది ప్లేయర్లు ఆడతారు. కానీ ప్యాంటసీ గేమ్స్‌లో రెండు జట్లలో ఆటగాళ్లను కలిపి 11 మందితో ఒక టీమ్‌ను ఎంపిక చేస్తారు. ఈ టీమ్‌లో ఏ జట్టు నుంచైనా సరే గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లకు మించకూడదు. ఐదుగురు ఆటగళ్లకంటే తక్కువ ఉండకూడదు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ ప్రతి ఆధారంగా టీమ్‌ను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి ఫ్యాంటసీ టీమ్‌లో ఎవరెవరున్నారో చూద్దాం
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
ఢిల్లీ జట్టులో కెఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్మ్ వంటి బ్యాటర్లు ఉండగా అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్ ఈ జట్టుకు బలంగా చెప్పుకోవచ్చు. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ వంటి సమర్థ బౌలర్లు ఉన్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
లక్నో జట్టు
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో రిషబ్ పంత్, నికోలస్ పూరన్ వంటి దిగ్గజ బ్యాటర్లు, మిచెల్ మార్షల్ వంటి ఆల్ రౌండర్, గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడిచేసే రవి బిష్ణోయ్ ఈ జట్టులో ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రీజులో నిలదొక్కుకుంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. కెఎల్ రాహుల్‌కు సైతం అద్భుతంగా బ్యాటింగ్ లైనఫ్ ఉంది.
ఫ్యాంటసీ జట్టు
రెండుజట్లలో ప్లేయర్స్ ఆధారంగ మీకోసం ఒక ఫ్యాంటసీ జట్టును ఎంపిక చేస్తున్నాం
1) ఎల్ రాహుల్ (ఢిల్లీ)
2) ఫాఫ్ డుప్లెసిస్ (ఢిల్లీ)
3) జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ)
4) రిషబ్ పంత్ (లక్నో)
5) నికోలస్ పూరన్ (లక్నో)
6) మిచెల్ మార్ష్ (లక్నో)
7) అక్షర్ పటేల్ (ఢిల్లీ)
8) కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ)
9) రవి బిష్ణోయ్ (లక్నో)
10) డేవిడ్ మిల్లర్ (లక్నో)
11) నటరాజన్ (ఢిల్లీ)
నోట్ : ఈ వార్త కేవలం మా దగ్గరున్న సమాచారంతో అంచనా వేసిన టీమ్ మాత్రమే. బెట్టింగ్ యాప్‌లకు ఈ వార్తకు ఎలాంటి సంబంధంలేదు.