IPL Strategic Time-Out: ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వెనుక ఇంత రహస్యం దాగి ఉందా
ABN , Publish Date - Mar 25 , 2025 | 07:34 PM
IPL Strategic Time-Out: ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమైనాయి. అయితే వీటిలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌ను అమలు చేస్తున్నారు. కానీ అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల్లో మాత్రం ఈ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అమలు చేయడం లేదు. ఇంతకీ ఈ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అంటే ఏమింటంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఈ ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అనే ఒక ప్రత్యేక నియమం ఉంది. దీని ప్రధాన ఉద్దేశ్యం జట్లకు ఆట మధ్యలో వ్యూహాలను సమీక్షించే అవకాశాన్ని కల్పిస్తారు. ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండు స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌లుంటాయి. బౌలింగ్ జట్టు 6 నుంచి 9 ఓవర్ల మధ్య.. అలాగే బ్యాటింగ్ జట్టు 13 నుంచి 16 ఓవర్ల మధ్య తీసుకోవచ్చు. ఒక్కో టైమ్ అవుట్ 3 నిమిషాల పాటు ఉంటుంది. 2009లో ప్రవేశపెట్టిన ఈ నియమం మొదట 7.5 నిమిషాలుగా ఉండేది. కానీ ఆట రిథమ్‌కు ఆటంకం కలిగిస్తుందని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తదితర ఆటగాళ్లు విమర్శించారు. దీంతో 2010లో దీన్ని సవరించారు.
అవి మాత్రం నిషిద్దం..
ఈ సమయంలో కోచ్‌లతో ఆటగాళ్లు వ్యూహాలపై చర్చించ వచ్చు. అలాగే ఆట పరిస్థితిని సైతం విశ్లేషించ వచ్చు. మంచినీరు తీసుకోవచ్చు. అదే విధంగా బౌలర్లు బంతి వేగాన్ని మార్చడం లేదా బ్యాటర్లు షాట్లను సమీక్షించడం వంటివి జరుపుతారు. అయితే ఆట ప్రారంభించడం, బంతిని ఉపయోగించడం లేదా బయటి వ్యక్తులతో (కోచ్‌లు తప్ప)సంప్రదించడం వంటివి పూర్తిగా నిషిద్ధం. ఈ టైమ్ అవుట్‌ను జట్టు కెప్టెన్ లేదా కోచ్ నిర్ణయిస్తారు. లేకుంటే.. అంపైర్లు 9వ లేకుంటే 16వ ఓవర్ చివరిలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇస్తారు.
రహస్యం వెనుక మరో కోణం..
ఇక ఈ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వెనుక రహస్యం మరో కోణం ఉంది. ఈ 3 నిమిషాల వ్యవధిలో ప్రసారకర్తలు ప్రకటనలు ప్రసారం చేసుకోవచ్చు. ఇది ఐపీఎల్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ఉదాహరణకు స్టార్ నెట్‌వర్క్ 10 సెకండ్ల ప్రకటనకు రూ.10 లక్షలు వసూలు చేస్తుందని సమాచారం. CEAT టైర్స్ వంటి స్పాన్సర్లు ఈ టైమ్ అవుట్‌ల కోసం సీజన్‌కు రూ. 30 కోట్ల వరకు చెల్లిస్తారని ఓ ప్రచారం ఉంది. అలాగే ఒక మ్యాచ్‌లో నాలుగు టైమ్ అవుట్‌లతో దాదాపు రూ.3.6 కోట్లు సంపాదిస్తారు.ఇది ఆట వ్యూహంతో పాటు వాణిజ్య ప్రయోజనాలను కలిపే విధానమని పలువురు అభివర్ణిస్తారు.
అంతర్జాతీయ టీ20ల్లో ఇంకా అమలు..
అయితే మరికొందరు ఈ టైమ్ అవుట్ ఆట ఉత్కంఠను దెబ్బతీస్తుందని విమర్శిస్తారు. 2014 క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రైనా (87, 25 బంతుల్లో) అద్భుతంగా ఆడుతుండగా..ఈ టైమ్ అవుట్ తర్వాత రనౌట్ అయ్యి ఓటమికి దారితీసింది. అయినప్పటికీ.. ఇది జట్లకు విరామం. అంతేకాదు వ్యూహాత్మక ప్రణాళికకు అవకాశం కల్పిస్తుంది. ఐపీఎల్‌లో ఈ నియమం విజయవంతమైనప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో ఇంకా ఇది అమలు కాలేదు.ఇది ఆటను మెరుగుపరచడమే కాకుండా..ఆర్థికంగా బలపరిచే సాధనంగా నిలుస్తుందని పలువురు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Supreme Court: ఎమ్మెల్యేలు ఫిరాయింపులు..చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
Train Cancellation.. Reservation Ticket Refund: ప్రయాణించాల్సిన రైలు రద్దు అయింది.. టికెట్ రిఫండ్ పొందడం ఎలాగంటే..
Summer: వేసవిలో శరీరాన్ని కూల్ కూల్‌గా ఉంచాలంటే..
MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..
For Sports News And Telugu News