Share News

Neeraj Chopra: డబుల్ ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా పెళ్లి వేడుక పిక్స్ వైరల్

ABN , Publish Date - Jan 20 , 2025 | 07:20 AM

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సడన్‌గా అభిమానులందరినీ ఆశ్చర్యపరిచారు. తాను పెళ్లి చేసుకున్నట్లు, అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Neeraj Chopra: డబుల్ ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా పెళ్లి వేడుక పిక్స్ వైరల్
Neeraj Chopras Wedding Photos

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి భారత్‌‌కు గొప్ప గౌరవం తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అథ్లెట్ నీరజ్ చోప్రా పెళ్లి (Neeraj Chopra wedding) ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక చాలా తక్కువ మంది సమక్షంలో ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో నీరజ్ చోప్రా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పెళ్లి ఫోటోలను (Neeraj Chopra Wedding Photos) షేర్ చేశారు.

ఈ ఫోటోలను చూసిన అభిమానులను ఆశ్చర్యపోయారు. సడన్ షాక్ ఇచ్చారేంటని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రాలలో కొంత మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.


ఆయన భార్య కూడా..

నీరజ్ చోప్రా భార్య హిమాని మోర్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, చివరిసారిగా 2017లో ఆడింది. హిమాని హర్యానాలోని లార్సౌలికి చెందినది. సోనిపట్‌లోని లిటిల్ ఏంజిల్స్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె ప్రస్తుతం అమెరికా మసాచుసెట్స్‌లోని అమ్హెర్స్ట్‌లోని మెక్‌కార్మాక్ ఇసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తోంది. ఇద్దరూ కలిసి ఈ కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. పెళ్లి సంభ్రమంలో వారు కుటుంబ సభ్యులతో గడిపారు. ఈ కార్యక్రమాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లు స్పష్టమవుతోంది. కానీ చోప్రా ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కోడుతున్నాయి.


సోషల్ మీడియాలో..

ఇటీవల ఒక మీడియా సంస్థతో వివరణాత్మక ఇంటర్వ్యూ ఇచ్చిన నీరజ్ చోప్రా, ఇంత త్వరగా తన వివాహాన్ని చేసుకుంటారని ఎవరూ అనుకోలేదు. ఆదివారం నీరజ్ చోప్రా ఖాతా నుంచి చిత్రాలను పోస్ట్ చేసిన వెంటనే, ఎవరూ దానిని ఒకేసారి నమ్మలేకపోయారు. కానీ కొంతకాలం తర్వాత నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నట్లు నిర్ధారించబడింది. అయితే నీరజ్ చోప్రా ఖాతా నుంచి మూడు చిత్రాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఒక ఫోటోలో ఆయన తన భార్య హిమానితో కలిసి కనిపిస్తున్నాడు. రెండో చిత్రంలో నీరజ్ దగ్గర కుటుంబ సభ్యులు కూర్చుని ఉన్నారు. మూడో చిత్రంలో నీరజ్ తల్లిదండ్రులు ఎడమవైపు కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ కొత్త ప్రయాణం వారికి శాంతి, ఆనందం, విజయాలను తీసుకురావాలని ఆశిస్తూ అనేక మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


నీరజ్ రికార్డులు..

2020 టోక్యోలో జరిగిన పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయుడు. సమ్మర్ గేమ్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన రెండో భారతీయుడు. ఆయన పారిస్ 2024లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. 27 ఏళ్ల నీరజ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ 2022లో డైమండ్ లీగ్ విజేత. 2018లో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నాడు. ఆసియా క్రీడల్లో రెండుసార్లు బంగారు పతకాలు దక్కించుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

Kho Kho Championship: పురుషుల ఖో ఖో టైటిల్ కూడా మనదే.. సరికొత్త రికార్డ్


India Women: నేపాల్‌ను మట్టి కరించిన భారత్.. ఖో ఖో మహిళల ప్రపంచ కప్ టైటిల్ కైవసం..


Business Idea: చిన్న మొక్కలు పెంచండి.. నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదించండి..


Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jan 20 , 2025 | 07:22 AM