Share News

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:02 PM

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. అలాంటి జట్టుకు జట్టులో స్థిరత్వం తీసుకొచ్చిన ఆటగాడు శాంసన్. కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే
Sanju Samson

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు జరగ్గా ప్రతి మ్యాచ్‌లో ఏదో ఉత్కంఠ.. చివరకు ఫలితం ఎటు తిరుగుతుందో తెలియక క్రికెట్ అభిమానులు కన్ఫ్యూజన్ అయిన పరిస్థితి చూశాం. బుధవారం మరో బిగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ గువాహటి వేదికగా రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అరగంట ముందు అంటే 7 గంటలకు టాస్ వేస్తారు. ఐపీఎల్‌లో ఎంతో అనుభవం కలిగన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రతిరోజు జరిగే మ్యాచ్‌లు చూస్తుంటే యువ ఆటగాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పుతున్నారు. ఇప్పటివరకు పెద్దగా ఫేమ్‌లో లేని ఆటగాళ్లు రాత్రికి రాత్రి ఫేమ్‌లోకి వస్తున్నారు. ఎవరు ఇవాళ్టి మ్యాచ్‌లో సత్తా చాటుతారో ఊహించడం కష్టంగానే ఉంది. కానీ గత గణంకాల దృష్ట్యా రాజస్థాన్ జట్టులో యమ డేంజరస్ బ్యా్ట్స్‌మెన్ ఎవరో తెలుసుకుందాం. బ్యాటింగ్‌కు దిగి క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించే బ్యాటర్ సంజు శాంసస్. రాజస్థాన్ జట్టులో శాంసన్‌‌ను పరుగుల రాక్షసుడిగా చెప్పుకోవచచ్చు.


ప్రారంభం నుంచి ఒడిదుడుకులు

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. అలాంటి జట్టుకు శాంసన్ జట్టులో స్థిరత్వం తీసుకొచ్చాడని చెప్పుకోవాలి. కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటవరకు దాదాపు శాంసన్ ఐపీఎల్‌లో 4485 పరుగులు చేయగా రాజస్థాన్ తరపున 3,800కు పైగా పరుగులు చేశాడు. ఈ జట్టు తరపున హాయ్యస్ట్ స్కోర్ చేసిన ఆటగాడు సంజు శాంసన్. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే 2013లో రాజస్థాన్ రాయల్స్ ‌జట్టులో చేరిన శాంసన్ మొదటి సీజన్‌లోనే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. 2016, 2017లో కోల్‌కతా జట్టుకు ఆడిన శాంసన్ మళ్లీ 2018లో తిరిగి రాజస్థాన్ జట్టులో చేరాడు. అప్పటినుంచి అతడి టాలెంట్ వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ జట్టు శాంసన్‌ను 2021లో కెప్టెన్‌గా నియమించింది. జట్టు సారధిగా తొలి మ్యాచ్‌లో 119 పరుగులతో సెంచరీ సాధించి అందరి దృ‌ష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో రాయల్స్ జట్టు ఓటమి చెందినా శాంసన్ తన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను అబ్బురపర్చాడు.


పవర్ ప్లేలో

సంజు శాంసన్ బ్యాటింగ్ శైలి చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఐపీఎల్‌లో దూకుడుగా ఆడే ఆటగాడు. పవర్ ప్లేతో పాటు మధ్య ఓవర్లలోనూ ఒకేలా హిట్టింగ్ చేయగల సామర్థ్యం కలిగిన క్రికెటర్ శాంవసన్. రాజస్థాన్ జట్టు తరపున ఇప్పటివరకు ఒక సెంచరీతో పాటు 20కి పైగా అర్థ శతకాలు సాధించాడు. 2022 సీజన్‌లో 458 పరుగులతో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2025 సీజన‌లో రాయల్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో 66 పరుగులు చేశాడు. దీంతో రానున్న మ్యాచ్‌లలో శాంసన్ డేంజరస్ బ్యాటర్‌గా మారాతాడని అంచనా వేయవచ్చు. రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడిగా పేరొందిన శాంసన్‌‌ను వేరీ డేంజరస్ బ్యా్ట్స్‌మెన్‌గా చెప్పుకోవచ్చు.


ఇవి కూడా చదవండి...

YSRCP Corruption: ఆఖరికి కుక్కల తిండినీ వదలలేదుగా..

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 26 , 2025 | 04:02 PM