Share News

Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త రికార్డ్.. రెండో భారతీయురాలిగా అరుదైన ఘనత

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:15 PM

భారత మహిళా బ్యాట్స్ మన్ స్మృతి మంధాన సరికొత్త రికార్డ్ సృష్టించింది. వన్డేల్లో 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త రికార్డ్.. రెండో భారతీయురాలిగా అరుదైన ఘనత
Smriti Mandhana

భారత మహిళా జట్టు, ఐర్లాండ్ మహిళల జట్టు మధ్య రాజ్‌కోట్‌లో తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారత జట్టు విజయానికి 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఐర్లాండ్ చేసిన 238 పరుగులకు ప్రతిస్పందనగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు మంచి ఆరంభాన్ని అందించి, స్కోర్ బీట్ చేసింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana), ప్రతీక రావల్ తొలి వికెట్‌కు 70 పరుగులు చేశారు. ఆ క్రమంలో స్మృతి మంధాన 29 బంతుల్లో 41 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోగా, ఈ బ్యాట్స్ మన్ ఒక అరుదైన ఘనతను సాధించింది.


ప్రత్యేక మైలురాయి

ఈ నేపథ్యంలో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు వేల వన్డే పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచింది. 28 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ వన్డేల్లో 4000 పరుగులు పూర్తి చేసుకుంది. మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్ ఈమె. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఈ ఘనతను సాధించింది. వన్డే ఫార్మాట్‌లో మంధాన 29 అర్ధ సెంచరీలు, తొమ్మిది సెంచరీలు సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన వారిలో ప్రపంచంలో 15వ బ్యాట్స్‌మన్‌గా మంధాన నిలిచింది.


బీసీసీఐ విషెస్

ఈ విషయాన్ని BCCI తన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి స్మృతి మంధానను అభినందిస్తూ ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో వన్డే ఫార్మాట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసినందుకు స్మృతి మంధానను అభినందనలు తెలియజేశారు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్మృతి మంధాన 29 బంతుల్లో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. దీంతోపాటు మరికొంత మంది కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. గ్రేట్ అని పలువురు, మరికొంత మంది వావ్ మంధాన అని పొగుడుతున్నారు.


ఇక మొదటి వన్డే గురించి చూస్తే

తొలి వన్డే గురించి చెప్పాలంటే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఐర్లాండ్ తరఫున, ఓపెనర్, కెప్టెన్ గాబీ లూయిస్ 129 బంతుల్లో అత్యధికంగా 92 పరుగులు చేసింది. ఇది కాకుండా లియా పాల్ 73 బంతుల్లో 59 పరుగులు రాబట్టింది. ఇక భారత్ తరఫున ప్రియా మిశ్రా అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టింది. టైటాస్ సాధు, సయాలి సత్ఘారే, దీప్తి శర్మలు ఒక్కో వికెట్ తీశారు. చివరకు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 241 రన్స్ చేసింది. ఈ క్రమంలో టీమిండియా ప్రతీక రావల్ 89, తేజల్ హసబ్నిస్ 50, స్మృతి మంధాన 41 రన్స్ చేసి భారత్ తరఫున మంచి స్కోర్ చేశారు.


ఇవి కూడా చదవండి:

Narendra Modi: చెడు ఉద్దేశంతో అలా చేయను.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..


Stock Market: వారాంతంలో కూడా భారీ నష్టాలు.. ఆల్‌టైం కనిష్టానికి రూపాయి..

Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 10 , 2025 | 06:17 PM