Share News

Apple: ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..

ABN , Publish Date - Mar 23 , 2025 | 09:15 PM

ఆపిల్ ప్రియులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో తన సిరీస్ వాచ్‌లలో కెమెరాలు అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Apple: ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..
Apple inbuilt cameras

ఆపిల్ సిరీస్ వాచ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా తమ అద్భుతమైన డిజైన్, ఫీచర్లతో కస్టమర్లకు విభిన్నమైన అనుభవాన్ని అందిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు, ఈ పరికరాల్లో కొత్త సాంకేతికతను తీసుకొస్తున్నారు. నివేదికల ప్రకారం, ఆపిల్ తన సిరీస్ వాచ్‌లలో కెమెరాలు చేర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే రెండేళ్లలో, ఈ వాచ్‌లలో AI ఆధారిత విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ప్రారంభించే యోచనలో ఉంది. దీంతో ఆపిల్ వాచ్‌ కేవలం కాల్ చేయడం లేదా ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం మాత్రమే కాకుండా, ఇప్పుడు "బయటి ప్రపంచాన్ని చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


నూతన ఫీచర్‌తో అదనపు అనుభవం

సాంకేతిక వర్గాల సమాచారం ప్రకారం ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 వంటి పరికరాల్లో, కెమెరాలు డిస్ప్లేలో భాగంగా ఉంటాయని అంటున్నారు. ఈ కెమెరాలు డిస్ప్లే లోపల ఉండగా, ఆపిల్ వాచ్ అల్ట్రాలో ఈ కెమెరాలు డిజిటల్ క్రౌన్, బటన్ పక్కన స్థానం పొందుపర్చుతారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కెమెరాలతో ఆపిల్ వాచ్ కొత్త పరికరాలుగా మారవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


సాప్ట్‌వేర్ ద్వారా

ఆ క్రమంలో ఇవి ప్రపంచంలో ఉన్న వస్తువులు, దృశ్యాలు, సన్నిహిత పరిసరాలను చూసి, వాటికి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని AI ద్వారా అందించగలవన్నారు. ఉదాహరణకు, ఆపిల్ వాచ్ సాయంతో మీరు సాప్ట్‌వేర్ ద్వారా చిత్రాల గుర్తింపు కూడా చేయవచ్చన్నారు. అవి అర్థం చేసుకుని దానిపై ఆధారపడిన సమాచారం అందిస్తాయన్నారు. నివేదిక ప్రకారం, ఈ సరికొత్త కెమెరా ఫీచర్లు విజువల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరింత శక్తివంతమైన పనులను చేస్తాయన్నారు.


కెమెరాతో AI ఫీచర్లు

ఈ AI ఫీచర్లు మరింత స్మార్ట్, ఇంటరాక్టివ్ అనుభవాన్ని కల్పిస్తాయని చెప్పారు. అంతేకాదు ఆపిల్ ఉత్పత్తులు మరిన్ని AI మోడళ్లను ఇంటర్నల్‌గా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 2027 నాటికి, ఆపిల్ మునుపటి మోడల్స్‌ను మరింత అభివృద్ధి చేసి, కస్టమర్లకు మరింత మెరుగైన AI సేవలను అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆపిల్ AR గ్లాసెస్ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయని, ఇది మరింత ఇంటరాక్టివ్ Augmented Reality (AR) అనుభవాన్ని కల్పిస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..


Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..


NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 09:15 PM