Share News

Grok 3: గ్రోక్ 3లో దిమ్మతిరిగిపోయే ఎడిటింగ్ ఫీచర్.. జెట్ స్పీడ్‌తో ఫొటోని ఇలా..

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:52 PM

Grok 3: విడుదలైన నాటి నుంచే ఏఐ పవర్ ఏంటో చూపిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న గ్రోక్ 3లో మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. దీని పనితీరును చూసిన ఎవరైనా అద్భుతం అనకుండా ఉండలేరు. అదేంటంటే..

Grok 3: గ్రోక్ 3లో దిమ్మతిరిగిపోయే ఎడిటింగ్ ఫీచర్.. జెట్ స్పీడ్‌తో ఫొటోని ఇలా..
Grok 3 Image Editing Feature

Grok 3 Image Editing Feature: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)మరోసారి టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద మార్పుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలోని ‘ఎక్స్‌ఏఐ (xAI)’ గ్రోక్ 3 చాట్ బాట్ (Grok 3) సేవలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. చాట్‌జీపీటీ, డీప్‌సీక్,గూగుల్ జెమిని, మెటా లాంటి ఏఐల జోరుకుబ్రేకులేస్తూ యూజర్ల మనసులు గెల్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గ్రోక్ 3 కి మరో కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఫొటో షాప్ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేసే ఈ ‘ఎడిట్‌ ఇమేజ్‌’ఫీచర్ పనితీరుకు హ్యాట్సాఫ్ చెప్పలేకుండా ఉన్నారు వినియోగదారులు.


రెప్పపాటులోనే ఫొటోని ఇలా..

ప్రజలకు ఊహించని సాంకేతిక మాయాజాలాన్ని పరిచయం చేస్తూ వరస ఆవిష్కరణలు ప్రవేశపెడుతున్నాడు బిలియనీర్ ఎలాన్ మస్క్. ఆ కోవకు చెందిందే గ్రోక్ 3. అడిగిన దానికి అడిగినట్లు సూటిగా సుత్తి లేకుండా సమాధానమిస్తూ ఔరా అనిపిస్తున్న ఈ ఏఐ చాట్ బాట్‌కు మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. అదే ‘ఎడిట్‌ ఇమేజ్‌’ ఫీచర్. ఇందులో మనం ఏదైనా ఫొటో ఇచ్చి టెక్ట్స్‌ కమాండిగ్ సాయంతో ఇమేజ్‌లో రెప్పపాటులోన నచ్చిన మార్పులు చేసుకోవచ్చు.


గ్రోక్ 3 ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ పనితీరుకు సంబంధించిన వీడియోను ఎలాన్‌మస్క్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇందులో గ్రోక్ 3 అకౌంట్లోకి లాగిన్ కాగానే సెర్చ్ బార్ కింద డీప్ సెర్చ్, థింక్, ఎడిట్ ఇమేజ్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఎడిట్ ఇమేజ్ (Edit Image) ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఇమేజ్‌లో ఎలాంటి మార్పులు చేయాలో టెక్స్ట్ ద్వారా కమాండ్ ఇవ్వాలి. వీడియోలో అయితే మస్క్ ఫొటోకు ADD A BLACK HAT అని బాణం గుర్తుపై క్లిక్ చేయగానే కోరిన ఫొటో ప్రత్యక్షమవుతుంది. ఇలా ఏ ఇమేజ్ అయినా సరే కోరిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పటికే డెస్క్‌టాప్‌లో గ్రోక్‌3 ఉపయోగిస్తున్న యూజర్లకు ఈ ఫీచర్ యాడ్ అయింది. అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.


Read Also : Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..

Elon Musk: గ్రోక్ హిందీ తిట్ల వివాదంపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. నెటిజన్ల విమర్శలు

Apple: ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..

Updated Date - Mar 24 , 2025 | 02:02 PM