Share News

WhatsApp Call : వాట్సాప్‌లో కొత్త కాలింగ్ ఫీచర్.. ఇక నుంచి ఇలా కూడా..

ABN , Publish Date - Mar 17 , 2025 | 04:12 PM

WhatsApp Call : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. కొత్తగా అప్‌డేట్‌ చేసుకున్న ప్రతి ఒక్కరూ WhatsAppలో ఈ కాలింగ్ ఫీచర్ సదుపాయం పొందుతారు. అదేంటంటే..

WhatsApp Call : వాట్సాప్‌లో కొత్త కాలింగ్ ఫీచర్.. ఇక నుంచి ఇలా కూడా..
Whatsapp New Feature

WhatsApp Call Without aving Number : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వాట్సాప్ వినియోగిస్తున్నారు. వయసు తారతమ్యాలు లేకుండా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ వాడుతున్నారు. మొత్తంగా చూస్తే వాట్సాప్‌ను 3.5 బిలియన్లకు పైగా ఉపయోగిస్తున్నారు. మేసేజింగ్, ఫోటోలు, వీడియోలు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉండటం వల్ల అందరూ కమ్యూనికేషన్ కోసం ఈ సోషల్ మీడియ ప్లాట్‌ఫాంనే యూజ్ చేస్తున్నారు. అందుకే యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంటుంది మెటా సంస్థ. తాజాగా వినియోగదారుల సౌకర్యం, భద్రత దృష్టిలో పెట్టుకుని సరికొత్త కాలింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో ఇక నుంచి నంబర్ సేవ్ చేసుకోకుండానే ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.


అర్జంట్‌గా బిజినెస్ పనిమీద తెలియని వ్యక్తి కోసం వాట్సాప్ కాల్ చేయాల్సి వస్తుంది. వెంటనే నెంబర్ సేవ్ చేసుకుని మాట్లాడేస్తారు. ఒకరి నెంబర్ అయితే సేవ్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు. రోజులో ఎక్కువసార్లు కొత్తవ్యక్తులతో మాట్లాడాల్సి వస్తే అప్పుడేం చేస్తారు. అనవసరమైన వ్యక్తుల నెంబర్లతో మీ కాంటాక్ట్ లిస్ట్‌ పెరిగిపోతూనే ఉంటుంది. ఇది చాలామంది చేసే పని. చాలామంది వినియోగదారులు సేవ్ చేస్తేనే వాట్సాప్ కాల్స్ చేయడం సాధ్యమవుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ, మీకు తెలియని విషయం ఏంటంటే. సాధారణ కాల్స్ లాగే వాట్సాప్‌లో కూడా నెంబర్ సేవ్ చేసుకోకుండానే ఎవరికైనా కాల్ చేసి మాట్లాడవచ్చు.


వినియోగదారులకు బెస్ట్ ఎక్స్‌పీరియెనస్ ఇచ్చేందుకు WhatsApp తన ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. నార్మల్ ఫోన్ కాల్ లాగే యూజర్ల ఏ నంబర్‌కైనా నేరుగా డయల్ చేసి కాల్ చేయగలిగే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీని సాయంతో నంబర్‌ను సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో కాల్ చేయడం ఎలాగో తెలుసుకుంటే తరచూ WhatsApp కాల్ కోసం అనవసరమైన నంబర్లు సేవ్ చేసుకోవాల్సిన పని తప్పుతుంది. సమయమూ ఆదా అవుతుంది.


నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్‌లో ఎలా కాల్ చేయాలి ?

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.

  • తర్వాత 'కాల్స్' ఐకాన్ క్లిక్ చేయండి.

  • '+' (ప్లస్) గుర్తుపై నొక్కండి. మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.

  • తర్వాత న్యూ కాల్ లింక్, కాల్ ఏ నంబర్, న్యూ కాంటాక్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్లండి.

  • న్యూ కాల్ నెంబర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే డయల్ ప్యాడ్ కనిపిస్తుంది.

  • చివరిగా నంబర్ టైప్ చేసి వాయిస్ కాల్ చేసుకోండి.


Read Also : సోషల్ మీడియా Xలో అంతరాయం.. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిందన్న ఎలాన్ మస్క్

Manus: చైనా మరో అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

YouTube: 9.5 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణమిదే..

Updated Date - Mar 17 , 2025 | 04:17 PM