Share News

Discount Offer: సామ్ సంగ్ ప్రముఖ మోడల్ 5జీ ఫోన్లపై 55 శాతం తగ్గింపు ఆఫర్

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:57 PM

రిపబ్లిక్ డేకు ముందు మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే Samsung Galaxy S23 5G 256GB వేరియంట్‌పై 55% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Discount Offer: సామ్ సంగ్ ప్రముఖ మోడల్ 5జీ ఫోన్లపై 55 శాతం తగ్గింపు ఆఫర్
Samsung Galaxy S23 5G Phone offer

రిపబ్లిక్ డే సేల్ కు ముందు ఫ్లిప్‌కార్ట్ Samsung Galaxy S23 5G పై కొత్త డీల్‌ను ప్రారంభించింది. కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నుంచి వచ్చిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 256GB వేరియంట్ అసలు ధర (రూ. 95,999) పై 55 శాతం తగ్గింపుకు అందిస్తున్నారు. ఈ క్రమంలో మీరు ఈ ఫోన్ డీల్‌ను కేవలం రూ.42,999కే పొందవచ్చు. అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. ఇది కొనుగోలుదారులకు మరింత తగ్గింపును అందిస్తున్నారని చెప్పవచ్చు.


Samsung Galaxy S23 5G ఫోన్ లక్షణాలు

  • Galaxy S23 అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది

  • ఇది నీరు, ధూళి నుంచి రక్షించే IP68 రేటింగ్‌తో వస్తుంది

  • ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో 6.1-అంగుళాల డైనమిక్ AMOLED స్క్రీన్ కలిగి ఉంది

  • ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1750 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది

  • ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ తోపాటు సున్నితమైన మల్టీ టాస్కింగ్‌తో వస్తుంది

  • ఈ ఫోన్ 8GB RAM, 512GB స్టోరేజ్ సపోర్టుతో వస్తుంది

  • ఇక కెమెరా గురించి చెప్పాలంటే ఈ పరికరం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP (ప్రధాన కెమెరా), 10MP (టెలిఫోటో కెమెరా), 12MP (యూజర్ల అల్ట్రావైడ్ ) సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం దీనికి 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది


బ్యాటరీ: 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 3900mAh బ్యాటరీ రోజంతా పనితీరుకు సపోర్ట్ చేస్తుంది

ఎక్స్ఛేంజ్ ఆఫర్లు

ఈ Samsung స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి మీ పాత ఫోన్ మార్పిడి ద్వారా దాదాపు రూ. 39000 వరకు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది. ఇది Galaxy S23 5G ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది.

మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఆసక్తి కలిగి ఉంటే ఇది మీకు సరైన అవకాశమని చెప్పవచ్చు. Samsung Galaxy S23 5G 2023లో లాంచ్ అయ్యింది. ఈ హ్యాండ్‌సెట్ అద్భుతమైన పనితీరును కలిగి ఉంది. ప్రీమియం ఫీచర్లతో లభిస్తుంది.


ఇవి కూడా చదవండి:

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 11 , 2025 | 04:59 PM