Share News

Hyderabad: తగ్గేదేలే.. చుక్కేసి పోలీసులకు చిక్కిన మద్యంప్రియులు

ABN , Publish Date - Jan 02 , 2025 | 10:46 AM

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు(Rachakonda Traffic Police) మద్యంప్రియులకు చెక్‌పెట్టారు. అయినప్పటికీ తగ్గేదేలేదన్నట్లు మద్యంప్రియులు చుక్కేసి పోలీసులకు చిక్కారు. ఎల్బీనగర్‌లో ఫ్లైఓవర్‌పై రాకపోకలు నిలిపివేశారు.

Hyderabad: తగ్గేదేలే.. చుక్కేసి పోలీసులకు చిక్కిన మద్యంప్రియులు

- నూతన సంవత్సర వేడుకల్లో పెరిగిన డీడీ కేసులు

- 2023 డిసెంబర్‌ 31న 535

- 2024 డిసెంబర్‌ 31న 619

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు(Rachakonda Traffic Police) మద్యంప్రియులకు చెక్‌పెట్టారు. అయినప్పటికీ తగ్గేదేలేదన్నట్లు మద్యంప్రియులు చుక్కేసి పోలీసులకు చిక్కారు. ఎల్బీనగర్‌లో ఫ్లైఓవర్‌పై రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఫ్లైఓవర్‌ నిర్మానుష్యం గా మారింది. పలు కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. రాచకొండ ట్రాఫి క్‌ జోన్స్‌ పరిధిలో 2025 -నూతన సంవత్సర వేడుకల్లో డీడీ కేసులు స్వల్పంగా పెరిగాయి. 2023 డిసెంబర్‌ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 535 డీడీ కేసులు నమోదు కాగా 2024 డిసెంబర్‌ 31 రాత్రి వాటి సంఖ్య 619గా రికార్డయింది.

ఈ వార్తను కూడా చదవండి: MP Etala: ప్రపంచం మెచ్చిన వ్యక్తి మహాత్మాగాంధీ


రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) నేతృత్వంలో 2024 డిసెంబర్‌ 31 రాత్రి ట్రాఫిక్‌ జోన్‌ - 1, 2ల పరిధుల్లో పలు కీలక కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులు డీడీ తనిఖీలు పకడ్బందీగా నిర్వహించారు. ట్రాఫిక్‌ అధికారులు తెలిపిన వివరాలు.. ట్రాఫిక్‌ జోన్‌ -1 పరిధిలోని మల్కాజిగిరి డివిజన్‌లోని మల్కాజిగిరి, ఉప్పల్‌, కుషాయిగూడ(Malkajgiri, Uppal, Kushaiguda), ఘట్‌కేసర్‌ ట్రాఫిక్‌ పీఎస్‏లు, (230 కేసులు) భువనగిరి డివిజన్‌లోని చౌటుప్పల్‌, భువనగరి, యాదాద్రి ట్రాఫిక్‌ పీఎస్‏లు, లా అండ్‌ ఆర్డర్‌ పీఎస్‏ల పరిధి(106 కేసులు)లో మొత్తం 336 డీడీ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ట్రాఫిక్‌ జోన్‌ - 2లోని ఎల్బీనగర్‌ డివిజన్‌లోని ఎల్బీనగర్‌, వనస్థలిపురం ట్రాఫిక్‌ పీఎ్‌సలు(232 కేసులు), మహేశ్వరం డివిజన్‌లోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ట్రాఫిక్‌ పీఎస్‏లు, లా అండ్‌ ఆర్డర్‌ పీఎస్‏ల పరిధి (51 కేసులు)లో మొత్తం 283 డీడీ కేసులు నమోదయ్యాయి. రెండు జోన్లలో మొత్తం 619 డీడీ కేసులు నమోదయ్యాయి.


డీడీ కేసుల్లో బైక్‌ రైడర్లే ఎక్కువ

డీడీ తనిఖీల్లో బైక్‌ రైడర్ల సంఖ్య పట్టుబడిన బైక్‌ రైడర్ల సంఖ్య మల్కాజిగిరి డివిజన్‌లో 198 ఉండగా భువనగిరి డివిజన్‌లో 80గా (మొత్తం 278) నమోదయింది. వారి సంఖ్య ఎల్బీనగర్‌ డివిజన్‌లో 209 ఉండగా మహేశ్వరం డివిజన్‌లో 39గా(మొత్తం 248) నమోదయింది. రెండు జోన్లలో 526మంది ద్విచక్ర వాహనదారులపై డీడీ కేసులు నమోదయ్యాయి. మిగతా వాహనదారుల్లో మల్కాజిగిరి, భువనగిరి డివిజన్లలో 13మంది ఆటో డ్రైవర్లపైన, 43 మంది కారు డ్ర్లైవర్ల పైన డీడీ కేసులు నమోదు కాగా, ఎల్బీనగర్‌, మహేశ్వరం డివిజన్లలో 13మంది ఆటో డ్రైవర్లపైన, 21 మంది కారు డ్ర్లైవర్ల పైన డీడీ కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్‌ జోన్‌- 2 డీసీపీ వీ.శ్రీనివాస్‌ డిసెంబర్‌ 31 మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో డీడీ తనిఖీలను పర్యవేక్షించారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, అదనపు సీఐ నాగరాజు, ఎస్‌ఐలు రవికుమార్‌, కృష్ణ, మధుబాబు, శంకర్‌ సిబ్బంది పాల్గొన్నారు.


ఎల్బీనగర్‌లో 108 ..

రాచకొండ ట్రాఫిక్‌ జోన్‌-2 ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో నూతన సంవత్సర వేడుకల వేళ 108 డీడీ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి ప్రధాన కూడళ్ల వద్ద మూడు ట్రాఫిక్‌ పోలీసు అధికారుల బృందాలు సిబ్బందితో మద్యంమత్తులో వాహనాలు నడుతున్న వారికి బీఏసీ పరీక్షలు నిర్వహించారు. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు కారు డ్రైవర్లపై, ముగ్గురు ఆటో డ్రైవర్లపైన, 101 ద్విచక్ర వాహనదారులపైన డీడీ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్‌ జోన్‌ 2 డీసీ పీ వీ.శ్రీనివాస్‌ రాత్రి పలు ప్రాంతాల్లో డీడీ తనిఖీలను పర్యవేక్షించారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, అదనపు సీఐ నాగరాజు, ఎస్‌ఐలు రవికుమా ర్‌, కృష్ణ, మధుబాబు, శంకర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

city9.2.jpg


మలక్‌పేటలో 96..

చాదర్‌ఘాట్‌: మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో 96మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో 12 కార్ల డ్రైవర్లు ఉండగా మిగతా 84మంది ద్విచక్ర వాహనదారులున్నారని మలక్‌పేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌, మూసారాంబాగ్‌ శ్రీపురంకాలనీ చౌరస్తాలో డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహించినట్లు ఆయన వివరించారు. ట్రాఫిక్‌ డీసీపీ ఆర్‌.వెంకటేశ్వర్‌రావు దిల్‌సుఖ్‌నగర్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ను పరిశీలించారు.


మద్యంప్రియుల హల్‌చల్‌..

సైదాబాద్‌: చంపాపేట ప్రధాన రహదారిపై ని ర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో మద్యంప్రియులు సంతోష్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపించారు. పట్టుబడ్డ మద్యంప్రియులు పోలీసులకే వార్నింగ్‌లు ఇచ్చారు. తమపై కేసులు నమోదు చేస్తే తామెంటో చూపిస్తామని మద్యంప్రియులు హల్‌చల్‌ చేశారు. మరికొందరు పోలీసుల కాళ్లవేళ్ల ప డ్డారు. సంతోష్ నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 91 కేసులు, నమోదు కాగా 65బైకులతో పాటు కార్లు, ఆటోలను సీజ్‌ చేశారు.


తనిఖీలు గుర్తించి పరుగులు

చంపాపేట ప్రధాన రహదారిపై పోలీసుల తనిఖీలు గమనించిన కొందరు మద్యంప్రియులు బైక్‌ల ను వదిలివేసి రోడ్లపై పరుగులు పెట్టారు. పోలీసు లు వారిని వెంబడించి పట్టుకుని తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. మరి కొందరు పట్టుబడ్డ మద్యంప్రియులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అర్ధరాత్రి వరకు వైన్స్‌, బార్లు ఓపెన్‌ చేసి డ్రంకెన్‌డ్రైవ్‌ టెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు.

సంయమనం పాటించిన పోలీసులు

తనిఖీల్లో కొందరు మద్యంప్రియులు దురుసుగా ప్రవర్తించినా సంతోష్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు సంయమనం పాటించారు. మరికొందరు తనిఖీలు చేసుకోమని భీష్మించిన వారిని సముదాయించి పరీక్షలు నిర్వహించారు. పోలీసులపై తిరగబడ్డ వారికి నచ్చచెప్పి పంపించారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు మెట్రో!

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2025 | 10:46 AM