Share News

Hyderabad: ఇందిరాపార్కులో టాయ్‌ ట్రైన్‌..

ABN , Publish Date - Mar 21 , 2025 | 09:00 AM

నగరంలోని ఇందిరాపార్కుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా దాదాపు దశాబ్దంన్నర క్రితం నిలిచిపోయిన టాయ్‌ ట్రైన్‌ సేవలను పునరుద్ధరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Hyderabad: ఇందిరాపార్కులో టాయ్‌ ట్రైన్‌..

- దశాబ్దంన్నర తర్వాత అందుబాటులోకి

- బిడ్‌లు ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ

-పెడల్‌/మోటార్‌ బోటింగ్‌ కోసం టెండర్‌

- ఆకట్టుకునేలా కసరత్తు

హైదరాబాద్‌ సిటీ: ఇందిరాపార్కు(Indira Park)కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు ప్రారంభించింది. సందర్శకులను ఆకట్టుకునేలా పలు సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. దాదాపు దశాబ్దంన్నర క్రితం నిలిచిపోయిన టాయ్‌ ట్రైన్‌(Toy train) సేవలను పునరుద్ధరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బిడ్‌లు ఆహ్వానిస్తూ గురువారం బల్దియా అర్బన్‌ బయోడైవర్సిటీ విభాగం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూకు విజయ డెయిరీ పాలు..


పార్కులోని చెరువులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెడల్‌/మోటార్‌ బోటింగ్‌ కోసమూ బిడ్‌లూ ఆహ్వానించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏడాది కాల వ్యవధికి ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. టాయ్‌ ట్రైన్‌ కనీస బిడ్‌ ప్రైస్‌ రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు. ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. ట్రైన్‌లో ఒక్కో ట్రిప్పునకు పది మంది పిల్లలకు అనుమతి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.20 చార్జీగా వసూలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ రుసము వసూలు చేయవద్దని టెండర్‌ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.


బోటింగ్‌

పెడల్‌/మోటార్‌ బోటింగ్‌ కనీస బిడ్‌ ప్రైస్‌ను రూ.2.97లక్షలుగా నిర్ణయించారు. ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చే సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇద్దరు/నలుగురు సామర్థ్యంతో కూడిన ఆరు బోట్ల ఏర్పాటుకు అవకాశం 20 నిమిషాల రైడ్‌కు పెడల్‌ బోట్‌లో రూ.30, మోటార్‌ బోట్‌లో రూ.50 రుసుముగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు టాయ్‌ ట్రైన్‌, బోటింగ్‌కు అవకాశం ఉంటుంది.


ఇతర సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఏజెన్సీలు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. 27వ తేదీ వరకు బిడ్‌ల దాఖలుకు అవకాశముంది. పార్కులో రోజ్‌ గార్డెన్‌, ఆకర్షణీయ మొక్కలు నాటి పచ్చందాల పెంచే ప్రక్రియను కూడా చేపట్టారు. పార్కులో పెద్దలకు ప్రవేశ రుసుము రూ.10, పిల్లలకు రూ.5గా ఉంది. టాయ్‌ ట్రైన్‌, బోట్స్‌కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Online Betting: ముదిరిన బెట్టింగ్‌ వ్యవహారం.. తారలపై కేసులు

BJP: రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2025 | 09:00 AM