Share News

BRS: వరంగల్‌లోనే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ!

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:21 AM

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నిర్వహణపై ఉత్కంఠకు తెరపడింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద సుమారు నాలుగైదులక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు.

BRS: వరంగల్‌లోనే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ!

వరంగల్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నిర్వహణపై ఉత్కంఠకు తెరపడింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద సుమారు నాలుగైదులక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకు అనుసంధానంగా, అనువుగా ఉండే ఎల్కతుర్తిని ఎంపిక చేశారు. వరుస ఓటముల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లోని నైరాశ్యాన్ని తొలగించేందుకు భారీ స్థాయిలో రజోత్సవ వేడుకలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్ణయించారు. ఏప్రిల్‌ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించాలని, 27న వరంగల్‌లో సుమారు ఐదు లక్షల మందితో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


కానీ, ఆశించిన స్థాయిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలు సభా స్థలాన్ని ఎంపిక చేయకపోవటంతో సీరియ్‌సగా తీసుకున్న కేసీఆర్‌.. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలో నిర్వహణకు మొగ్గుచూపారన్న ప్రచారం జరిగింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా గులాబీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ఎర్రవెల్లిలో మంగళవారం రాత్రి కలిసి సభను వరంగల్‌లోనే నిర్వహించాలని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీష్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వినయ్‌భాస్కర్‌ 1500 ఎకరాల్లో సభ స్థలాన్ని గుర్తించి పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 04:21 AM