Share News

CM Revanth Reddy: వారధులైనా.. సారథులైనా మీరే

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:49 AM

‘‘మీరు ఒక సారి పరీక్ష రాస్తే.. 35 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు.. మేం మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పరీక్ష రాయాలి. రాష్ట్రానికి వారధులైనా.. సారథులైనా మీరే’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: వారధులైనా.. సారథులైనా మీరే

ఆర్థిక పరిస్థితి కుదట పడిన వెంటనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం

  • ప్రతిపక్ష నేతల ఉచ్చులో చిక్కుకోవద్దు

  • ఒక సారి మాటిస్తే రేవంతన్న తప్పడు

  • టీజీవో డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘‘మీరు ఒక సారి పరీక్ష రాస్తే.. 35 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు.. మేం మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పరీక్ష రాయాలి. రాష్ట్రానికి వారధులైనా.. సారథులైనా మీరే’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ధర్నాలు, రాస్తారోకోలతో ఉపయోగం లేదని, చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో ఉద్యోగులు పడొద్దని సూచించారు. తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం(టీజీవో) డైరీ, క్యాలెండర్‌ను సచివాలయంలో శుక్రవారం సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.


ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఒకసారి మాట ఇస్తే దాన్ని అమలు చేయడానికి రేవంత్‌ అన్న సిద్ధంగా ఉంటాడని, ఆర్థిక పరిస్థితి కుదుట పడిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు శ్యామ్‌ ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. అలాగే, స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూ) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీని కూడా ముఖ్యమంత్రి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌ రెడ్డి, సదానందం గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 04:49 AM