Share News

CM Revanth Reddy: నెలాఖరులోగా ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన

ABN , Publish Date - Jan 12 , 2025 | 03:39 AM

ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: నెలాఖరులోగా ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన

  • ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మరోసారి టికెట్‌ లేనట్లే

  • అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై సీఎం శనివారం తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి భవన నిర్మాణానికి గోషామహల్‌లో ఇవ్వాలని నిర్ణయించిన స్థలం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ఆదేశించారు.


నిర్మాణాల నమూనా మ్యాప్‌లను అధికారులు చూపించగా వాటిలో పలు మార్పులు, చేర్పులను సీఎం సూచించారు. మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. రోడ్డు విస్తరించినా, ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా డిజైన్లు రూపొందించాలన్నారు. రోగుల సహాయకులు ేసదతీరేందుకు పార్కు ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక వసతులతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Updated Date - Jan 12 , 2025 | 03:39 AM