Share News

Hyderabad: నేడు విద్యాసాగర్‌రావు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 04:14 AM

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆత్మకథ.. ఉనిక పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించనున్నారు.

Hyderabad: నేడు విద్యాసాగర్‌రావు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆత్మకథ.. ఉనిక పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించనున్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని బీజేపీ నాయకులు శనివారం తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 04:14 AM