Share News

Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లించకుంటే సెమిస్టర్‌ పరీక్షలు బంద్‌

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:26 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే త్వరలో జరగనున్న సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించలేమని తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది.

Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లించకుంటే సెమిస్టర్‌ పరీక్షలు బంద్‌

  • డిగ్రీ కాలేజీ యాజమాన్యాల హెచ్చరిక

  • ప్రభుత్వానికి ఈ నెల 20 వరకు గడువు

హైదరాబాద్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే త్వరలో జరగనున్న సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించలేమని తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది. రూ. 2500 కోట్ల బకాయిలను మార్చి-20లోపు చెల్లించాలంటూ గడువు విధించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి అధ్వర్యంలోని ప్రతినిధుల బృందం మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందించింది.


గత 16 నెలల్లో ఇప్పటివరకు కనీసం 20 శాతం కూడా ఫీజు బకాయిలు విడుదల చేయలేదని సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి తెలిపారు. యాజమాన్యాలన్నీ ఆర్థిక భారం, అప్పుల బాధతో కళాశాలలు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 04:26 AM