ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై బీఆర్‌ఎస్ శవ రాజకీయాలు..
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:35 AM
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, మేడిపల్లి సత్యం దుయ్యబట్టారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో వారు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ఎమ్మెల్యేల మండిపాటు
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, మేడిపల్లి సత్యం దుయ్యబట్టారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో వారు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు గుర్తు చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, మంత్రులకు ఆదేశాలిచ్చారన్నారు. కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగితే అప్పటి సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని విమర్శించారు. ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినప్పటికీ బీఆర్‌ఎస్ నేతల్లో మార్పు రాలేదని విమర్శించారు. ప్రమాద ఘటనపై మాజీ మంత్రులు ఎవరు మాట్లాడడం లేదని.. కేవలం కవిత, హరీశ్‌రావు, కేటీఆర్‌లే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ఎస్‌ఎల్‌బీసీ సంఘటనా స్థలానికి రాలేదని ప్రశ్నించారు.