Share News

Seethakka: కాంట్రాక్ట్‌ గురుకుల టీచర్ల సమ్మె విరమణ

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:17 AM

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్‌టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం కావడంతో 16 రోజులుగా సమ్మె చేస్తున్న వారు సమ్మె విరమించినట్టు ప్రకటించారు.

Seethakka: కాంట్రాక్ట్‌ గురుకుల టీచర్ల సమ్మె విరమణ

  • మంత్రి సీతక్కతో చర్చలు సఫలం

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్‌టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం కావడంతో 16 రోజులుగా సమ్మె చేస్తున్న వారు సమ్మె విరమించినట్టు ప్రకటించారు. శనివారం నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా పేర్కొన్నారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, మినిమం టైం ేస్కల్‌ మినహా ఇతర అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించేందుకు సీఆర్‌టీలు అంగీకరించారు.


ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, మరణ ప్రయోజనాలు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మాలోతు సోమేశ్వర్‌ తెలిపారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, మినిమం టైం ేస్కల్‌ డిమాండ్లపై సీఎంతో చర్చించేందుకు మరోసారి సమావేశానికి మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు వివరించారు.

Updated Date - Jan 04 , 2025 | 04:17 AM