Share News

Harish Rao: రెండో ఫోన్‌ట్యాపింగ్‌ కేసుపై ముందుగానే విచారణ

ABN , Publish Date - Feb 22 , 2025 | 04:24 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్‌ (రెండో ఫోన్‌ట్యాపింగ్‌ కేసు) కేసు విచారణ ముందుకు జరిగింది. మార్చి మూడో తేదీ బదులు ఈ నెల 27వ తేదీనే వాదనలు జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు నిర్ణయం తీసుకొంది.

Harish Rao: రెండో ఫోన్‌ట్యాపింగ్‌ కేసుపై ముందుగానే విచారణ

  • మార్చి 3 బదులు ఈ నెల 27నే వాదనలు.. హైకోర్టు నిర్ణయం

  • దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్‌ (రెండో ఫోన్‌ట్యాపింగ్‌ కేసు) కేసు విచారణ ముందుకు జరిగింది. మార్చి మూడో తేదీ బదులు ఈ నెల 27వ తేదీనే వాదనలు జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు నిర్ణయం తీసుకొంది. పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు నిలిపేయాలంటూ ఈనెల 19న ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం చేసిన దరఖాస్తు జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. స్టేట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. ఈనెల 27న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అందుబాటులో ఉంటారని, ఆ రోజున పూర్తిస్థాయి వాదనలు వినిపిస్తామని చెప్పారు. దాంతో ధర్మాసనం విచారణ తేదీని 27కు మార్చింది.


కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్లపై నోటీసులు

పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కాంట్రాక్టర్ల నుంచి రూ. 2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీ కాంగ్రె్‌సకు కప్పం కట్టారని, ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిపోతారన్న వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. పోలీసులు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ మార్చి 18కి వాయిదాపడింది. మరోవైపు ్ల ఎన్నికల సందర్భంగా నమోదైన ఓ ఎన్నికల కేసును కొట్టేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సైతం వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీచేసింది.

Updated Date - Feb 22 , 2025 | 04:24 AM