Share News

Chicken: చికెన్‌ తినడం వల్ల అనారోగ్యం రాదు..

ABN , Publish Date - Feb 21 , 2025 | 10:39 AM

చికెన్‌(Chicken) తినడం వల్ల ఎలాంటి అనారోగ్యం రాదని, చికెన్‌ ప్రియులు నిస్సంకోచంగా చికెన్‌ తినవచ్చని ప్రముఖ రేడియాలజిస్ట్‌ వికాస్‌రెడ్డి(Radiologist Vikas Reddy) అన్నారు.

Chicken: చికెన్‌ తినడం వల్ల అనారోగ్యం రాదు..

హైదరాబాద్: చికెన్‌(Chicken) తినడం వల్ల ఎలాంటి అనారోగ్యం రాదని, చికెన్‌ ప్రియులు నిస్సంకోచంగా చికెన్‌ తినవచ్చని ప్రముఖ రేడియాలజిస్ట్‌ వికాస్‌రెడ్డి(Radiologist Vikas Reddy) అన్నారు. ఆస్మా పౌల్ర్టీ ఫార్మ్స జయనప్‌ పోల్ర్టీ ట్రేడర్స్‌ కమ్రాద్దీన్‌ ఆధ్వర్యంలో గురువారం మణికొండ 7 టూంబ్స్‌ రోడ్డులో ఉచిత చికెన్‌ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల వంటకాలను ప్రజలకు ఉచితంగా తినిపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: DCP: పోగొట్టుకున్న సొమ్ము బాధితుల ఖాతాల్లో జమ..


city9.jpg

ఈ సందర్భంగా వికాస్‌రెడ్డి మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో చికెన్‌ గురించి వస్తున్న అపోహాలను నమ్మవద్దని అన్నారు. ఎవరో కావాలని ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, బర్డ్‌ఫ్లూ(Bird flu) కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు. 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో చికెన్‌ ఉడికితే ఎలాంటి వైరస్‌ అయినా చనిపోతుందని తెలిపారు. చికెన్‌ ప్రియులు ఆనందంగా చికెన్‌ తినవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పౌల్ర్టీ సభ్యులు సురేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కార్తీక్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా

ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్‌ గురుదక్షిణ

ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2025 | 10:39 AM