Share News

ED Investigation: ఈడీ విచారణకు బీఎల్‌ఎన్‌ రెడ్డి డుమ్మా

ABN , Publish Date - Jan 03 , 2025 | 03:42 AM

ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈ మెయిల్‌ ద్వారా ఈడీ అధికారులను కోరారు.

ED Investigation: ఈడీ విచారణకు బీఎల్‌ఎన్‌ రెడ్డి డుమ్మా

  • కొంత సమయం కావాలంటూ ఈ-మెయిల్‌

  • నేటి విచారణకు రాలేనన్న అరవింద్‌కుమార్‌ మరోసారి పిలుస్తామని ఈడీ జవాబు

హైదరాబాద్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈ మెయిల్‌ ద్వారా ఈడీ అధికారులను కోరారు. దీనికి వారు సానకూలంగా స్పం దించి.. మరోసారి పిలుస్తామని జవాబు ఇచ్చారు. శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ కూడా తాను రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కోరారు. దీంతో ఆయనను కూడా మరో రోజు విచారణకు పిలుస్తామని అధికారులు తెలిపారు. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఏసీబీ కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత విచారణకు హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకోవాలని బీఎల్‌ఎన్‌ రెడ్డి, అరవింద్‌ కుమార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ను ఈ నెల 7న హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే... కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం తేలే అవకాశం ఉంది.

Updated Date - Jan 03 , 2025 | 03:42 AM