‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:13 AM
యునైటెడ్ బేవరేజీస్ కంపెనీలో కింగ్ ఫిషర్ బీర్ల తయారీని ఎక్సైజ్ మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు శుక్రవారం పరిశీలించారు.

హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): యునైటెడ్ బేవరేజీస్ కంపెనీలో కింగ్ ఫిషర్ బీర్ల తయారీని ఎక్సైజ్ మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు శుక్రవారం పరిశీలించారు. శిక్షణ కానిస్టేబుళ్లు బీర్ తయారీని పరిశీలించడం ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదే తొలిసారని ఉన్నతాధికారులు తెలిపారు. మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఆకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధర్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య.. మహిళా శిక్షణ కానిస్టేబుళ్లను మల్లేపల్లిలో బీరు కంపెనీ పరిశీలనకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీరు బాటిళ్లను శుభ్రపరచడం నుంచి బీరు తయారీ విధానం, ప్యాకింగ్ వరకు అన్ని విషయాలను కంపెనీ కస్టర్ హెడ్ జయతీ షెకావత్, డీస్పాచ్ ఇంచార్జ్ హీస్‌తోష్ ఇతర అధికారులు కానిస్టేబుళ్లకు వివరించారు.