Share News

Pharma City: ఫార్మాసిటీపై నిరసన తెలిపే హక్కు రైతులకుంది

ABN , Publish Date - Jan 12 , 2025 | 03:57 AM

ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు భూములు కోల్పోతున్న రైతులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై వారు నిర్వహించే పాదయాత్ర, అవగాహన శిబిరాలు, కరపత్రాలు పంపిణీ వంటి కార్యక్రమాలను అడ్డుకోరాదని పేర్కొంది.

Pharma City: ఫార్మాసిటీపై నిరసన తెలిపే హక్కు రైతులకుంది

  • వారిని అడ్డుకోకూడదు.. హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు భూములు కోల్పోతున్న రైతులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై వారు నిర్వహించే పాదయాత్ర, అవగాహన శిబిరాలు, కరపత్రాలు పంపిణీ వంటి కార్యక్రమాలను అడ్డుకోరాదని పేర్కొంది. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సర్వే, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదంటూ ఇబ్రహీంపట్నం పోలీసు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వీటిని సవాల్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్‌నగర్‌, మేడిపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. నిరసన తెలిపే హక్కును నిరాకరించడం అంటే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అని పేర్కొంది. నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదంటూ పోలీసు అధికారి ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. నిరసన కార్యక్రమాల్లో నేరచరిత్ర ఉన్న వారు పాల్గొనకుండా చూసుకోవాలని రైతులకు సూచించింది. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటే పోలీసులు తగిన చర్యలు తీసుకోవచ్చని, పేర్కొంది.

Updated Date - Jan 12 , 2025 | 03:57 AM