Share News

Cervical Cancer: నేటి నుంచి బసవతారకం ఆస్పత్రిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ ఉచిత స్ర్కీనింగ్‌ శిబిరం

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:10 AM

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో సర్వైకల్‌(గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ ఉచిత స్ర్కీనింగ్‌ శిబిరం ఏర్పాటు చేశారు.

Cervical Cancer: నేటి నుంచి బసవతారకం ఆస్పత్రిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ ఉచిత స్ర్కీనింగ్‌ శిబిరం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో సర్వైకల్‌(గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ ఉచిత స్ర్కీనింగ్‌ శిబిరం ఏర్పాటు చేశారు. ప్రపంచ సర్వైకల్‌ క్యాన్సర్‌ అవగాహన నెల సందర్భంగా సోమవారం నుంచి ఈనెలాఖరు వరకు అన్ని పనిదినాల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 1గం.ల వరకు ఈ శిబిరం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శిబిరంలో వైద్యులు ఉచితంగా ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారని, అనుమానమున్న వారికి పాప్‌స్మియర్‌ పరీక్షలో 50 శాతం, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 040-23551235 ఎక్స్‌టెన్షన్‌ 2335, 2354, 2216 లలో సంప్రదించవచ్చని చెప్పింది.

Updated Date - Jan 06 , 2025 | 04:10 AM