Share News

GHMC: జీహెచ్‌ఎంసీ యాప్‌లో ఫాగింగ్‌.. దోమల నివారణకు అధునాతన సేవలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 08:28 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో దోమల నివారణకు అధునాతన సేవలు వినియోగంలోకి తెచ్చింది. దీనిలో భాగంగా ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌లో అభ్యర్థన పెట్టండి.. ఫాగింగ్‌ చేస్తాం.. అంటూ తెలుపుతోంది.

GHMC: జీహెచ్‌ఎంసీ యాప్‌లో ఫాగింగ్‌.. దోమల నివారణకు అధునాతన సేవలు

  • మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో ప్రత్యేక ఆప్షన్‌

హైదరాబాద్‌ సిటీ: ‘మీ ఏరియాలో దోమల తీవ్రత ఎక్కువగా ఉందా? నివారణ చర్యలు చేపట్టడం లేదా? అయితే ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌('My GHMC' app)లో అభ్యర్థన పెట్టండి. ఫాగింగ్‌ చేస్తాం’ అని చెబుతోంది సంస్థ. ఇందుకోసం యాప్‌లో ప్రత్యేకంగా రిక్వెస్ట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో అదనపు కమిషనర్‌(హెల్త్‌) ఎస్‌ పంకజ తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి. JNTU: జేఎన్‌టీయూకు విజయ డెయిరీ పాలు..


ఇతర ఫిర్యాదుల తరహాలో కాకుండా, ఈ వినతులపై సంబంధిత అధికారులు స్పందిస్తున్నారా? క్షేత్రస్థాయిలో ఫాగింగ్‌ జరిగిందా? లేదా? అన్నది సాంకేతికంగా పర్యవేక్షించనున్నారు. జియో ట్యాగింగ్‌(Geo Tagging) ఉన్న యంత్రాలు నిర్ణీత ప్రాంతంలో ఫాగింగ్‌ చేశాయా? లేదా? అన్నది సులువుగా తెలిసిపోతుంది. ప్రయోగాత్మకంగా జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో తొలుత ఈ విధానం అమలు చేస్తున్నామని, ఫలితాలను బట్టి జీహెచ్‌ఎంసీ(GHMC) అంతటా విస్తరిస్తామని పంకజ తెలిపారు.


city4.jpg

రిక్వెస్ట్‌ చేయండిలా..

- మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ఓపెన్‌ చేసి దిగున ఉన్న ఫాగింగ్‌పై క్లిక్‌ చేయాలి.

- అనంతరం రెయిజ్‌ ఏ రిక్వెస్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

- ఫాగింగ్‌ చేయాల్సిన ప్రాంతం వివరాలను మొబైల్‌లోని కరెంట్‌ లొకేషన్‌ లేదా లొకేట్‌ ఆన్‌ మ్యాప్‌ ఆప్షన్‌లో ఎంచుకోవాలి.

- పేరు, ల్యాండ్‌ మార్క్‌, మొబైల్‌ నెంబర్‌ తదితర వివరాలు నమోదు చేయాలి.

- ఏరియాకు సంబంధించిన కనీసం ఒక ఫొటో అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌ చేయాలి.


- రిక్వెస్ట్‌ రెయిజ్‌ అయినట్టు మీ మొబైల్‌ నంబర్‌కు సందేశం వస్తుంది.

- ఆ రిక్వెస్ట్‌ ఆటోమేటిక్‌గా సంబంధిత అధికారికి వెళ్తుంది. ఆ అధికారి ఏరియా వర్కర్‌కు ఫాగింగ్‌ చేయాలని అసైన్‌ చేస్తారు.

- ఫాగింగ్‌ చేస్తోన్న సమయంలో ఆకాంక్షం, రేఖాంశం నమోదయ్యేలా ఫొటోలు తీసి సిబ్బంది యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

- ఒక ఏరియాలో ఫాగింగ్‌ వినతి వస్తే.. చుట్టు పక్కల 100 మీటర్ల మేర మరో రికెస్ట్‌ చేసే అవకాశం ఉండదు. ఒకే ప్రాంతంలో (100 మీటర్ల లోపు) ఒకటి కంటే ఎక్కువ రిక్వె్‌స్టలు రాకుండా సాఫ్ట్‌వేర్‌ నిరోధిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Online Betting: ముదిరిన బెట్టింగ్‌ వ్యవహారం.. తారలపై కేసులు

BJP: రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2025 | 08:33 AM