Share News

Half Day Schools: పిల్లలకు పండుగలాంటి వార్త.. ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే..

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:51 PM

Half Day Schools: ఒంటిపూట బడులు, వేసవి సెలవులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరి పిల్లలకు ఒక్కపూట బడులు ఎప్పటి నుంచి.. వేసవి సెలవులు ఎప్పటి నుంచి.. పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి..

Half Day Schools: పిల్లలకు పండుగలాంటి వార్త.. ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే..
Half Day Schools

హైదరాబాద్, మార్చి 13: స్కూల్ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఎండలు దంచుతున్న వేళ.. కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి ఒక్కపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం నాడు పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను సర్కార్ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్కూళ్లను నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.


Also Read:

వామ్మో ఎలా తిట్టుకున్నారో చూడండి...

ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేకే ఎమ్మెల్యే అక్కసు..

పార్టీ నేతలే టార్గెట్‌గా రాజాసింగ్ సంచలన లేఖ

For More Telangana News and Telugu News..

Updated Date - Mar 13 , 2025 | 03:51 PM