Share News

Harish Rao: ప్రజా వాణి.. ఉత్త ప్రహసనం!

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:20 AM

సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఉత్త ప్రహసనంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: ప్రజా వాణి.. ఉత్త ప్రహసనం!

  • ప్రజాసమస్యలకు పరిష్కారమేది?: హరీశ్‌రావు

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఉత్త ప్రహసనంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ సర్కారు చెబుతున్న ప్రజాపాలన ప్రజాపీడనగా మారిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్‌టీఐ కింద అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2024 డిసెంబరు 9నాటికి ప్రజలనుంచి ప్రజావాణికి 82,955 పిటిషన్లు వచ్చాయని, అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్‌ కిందకు వస్తాయని మిగతావి దాని పరిధిలోకి రావని చెబుతున్నారన్నారు.


అంటే... సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించినట్లు కనబడుతోందన్నారు. గ్రీవెన్స్‌ పరిధిలోకి వచ్చే.. 43,272ఫిర్యాదుల్లోనూ 27,215 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయని అధికారులు చెబుతున్నా.. అందులోనూ వాస్తవంలేదన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 04:20 AM