Vehicle Registration: హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు సెప్టెంబరు 30 గడువు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:18 AM
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎ్‌సఆర్‌పీ)ను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై అన్ని వాహనాలకూ తప్పనిసరి
లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవు
బీమా, కాలుష్య సర్టిఫికెట్ సైతం బందే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎ్‌సఆర్‌పీ)ను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలు కూడా ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీలోగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుకోవాలని గడువు విధించింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువు నాటికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఆమర్చుకోని వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు.
నిర్ణీత గడువులోగా నంబర్ ప్లేట్లు అమర్చుకోని వాహనానికి బీమా రెన్యువల్‌ను అనుమతించరాదని ఆయా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశామని, కాలుష్య సర్టిఫికెట్ సైతం జారీ చేయబోమని స్పష్టం చేశారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం అధికారిక వెబ్ సైట్ ఠీఠీఠీ.టజ్చీఝ.జీుఽ లో బుక్ హెచ్‌ఎ్‌సఆర్‌పీ బటన్‌పై క్లిక్ చేసి పొందవచ్చు. ద్విచక్ర వాహనాలకు రూ.320-380, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాలకు రూ.400-500, కార్లకు రూ.590-700, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లకు రూ.700-860, ఆటోలకు రూ.350-450, వాణిజ్య వాహనాలకు రూ.600-800 చొప్పున ధరలు నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News