Hyderabad: పటిష్ట నిఘా.. ఫలించిన వ్యూహం
ABN , Publish Date - Jan 02 , 2025 | 09:17 AM
అడుగడుగునా పోలీస్ నిఘా.. వందలాది మంది పోలీసులతో శాంతిభద్రతల పరిరక్షణ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు స్పెషల్ ఫోకస్.. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్(Police Commissioner)లు..
- రాత్రంతా రోడ్లపైనే పోలీసులు
- అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
- ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరణ
- బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ ఉన్నతాధికారులు
హైదరాబాద్ సిటీ: అడుగడుగునా పోలీస్ నిఘా.. వందలాది మంది పోలీసులతో శాంతిభద్రతల పరిరక్షణ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు స్పెషల్ ఫోకస్.. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్(Police Commissioner)లు.. మొత్తం మీద న్యూ ఇయర్ వేడుకలను నగరవాసులు మంగళవారం రాత్రి ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అర్ధరాత్రి గడియారం ముల్లు 12:00మీదకు పడగానే నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడికక్కడ ఎవరికి అనువైన ప్రాంతాల్లో వారు కేకులు కట్ చేస్తూ 2025 సంవత్సరానికి స్వాగతం పలికారు. ట్రై కమిషనరేట్ పరిధిలో లక్షలాది మంది యువత న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ భవనాలకు రెట్టింపు బాదుడు..
రాత్రంతా రోడ్లపైనే పోలీసులు..
పోలీస్ ఉన్నతాధికారుల ముందస్తు వ్యూహంతో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. కొత్త సంవత్సర వేడుకలకు పది రోజుల ముందు నుంచే పోలీస్ ఉన్నతాధికారులు నగరవాసులను అప్రమత్తం చేశారు. ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఈవెంట్స్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ప్రశాంత వాతావరణంలో నగరవాసులు కుటుంబ సభ్యులతో సహా కొత్త సంవత్సర వేడుకలను ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు.
వేడుకలు నిర్వహించే ప్రతీచోటా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులకు ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా ప్రత్యేక పోలీసులతో పాటు.. షీ టీమ్ సిబ్బందిని మఫ్టీలో రంగంలోకి దింపారు. వందలాది మంది పోలీసులు రాత్రంతా రోడ్లపైన పహారా కాశారు. ట్రై కమిషనరేట్స్ పరిధిలోని ఒక్కో ట్రాఫిక్ పోలీస్ పరిధిలో 3 చెక్‌పోస్టుల చొప్పున డ్రంకెన్ డ్రైవ్‌లు నిర్వహించారు. అయితే, పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు అధికంగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, పంజాగుట్ట వెస్ట్‌జోన్(Panjagutta West Zone) తదితర ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ఒక్కో పీఎస్ పరిధిలో 5 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
ఒకవైపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూనే.. మరో వైపు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బుధవారం తెల్లవారుజామున 5గంటల వరకు పోలీసులు చలిలో రాత్రంతా రోడ్లపైనే విధులు నిర్వహించారు. హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్వయంగా భద్రతను పర్యవేక్షించడం, ముందస్థు వ్యూహంతో వ్యహరించడంతో ఇన్సిడెంట్స్ ఫ్రీగా న్యూ ఇయర్ వేడుకలు ముగిశాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరమపదించడం, సంతాప దినాలు ఉండటంతో పోలీస్ ఉన్నతాధికారులు ఎక్కడా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించలేదు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News