Share News

Hyderabad: పని ఒకరికి.. ఫలితం మరొకరికి..

ABN , Publish Date - Jan 02 , 2025 | 08:30 AM

ఉస్మానియా ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం నర్సుల పాలిట శాపంగా మారింది. పదినెలల కష్టార్జితం ఇతరుల ఖాతాల్లోకి చేరింది. రాత్రనక, పగలనక సేవలందించిన నర్సుల కష్టం పది నెలల క్రితం ఉస్మానియా ఆస్పత్రి నుంచి బదిలీపై వెళ్లిన నర్సుల ఖాతాల్లో జమ చేశారు అధికారులు.

Hyderabad: పని ఒకరికి.. ఫలితం మరొకరికి..

- ఆరోగ్యశ్రీ అలవెన్సులు ఇతరుల ఖాతాల్లోకి

- పది నెలల నుంచి రాకపోవడంతో ఆందోళనలో 130 మంది నర్సులు

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం నర్సుల పాలిట శాపంగా మారింది. పదినెలల కష్టార్జితం ఇతరుల ఖాతాల్లోకి చేరింది. రాత్రనక, పగలనక సేవలందించిన నర్సుల కష్టం పది నెలల క్రితం ఉస్మానియా ఆస్పత్రి నుంచి బదిలీపై వెళ్లిన నర్సుల ఖాతాల్లో జమ చేశారు అధికారులు. ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)లో 2024 ఫిబ్రవరి నెలలో 130 మంది నర్సులు కొత్తగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి సాధారణ సేవలతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలు, నైట్‌ డ్యూటీలు చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ భవనాలకు రెట్టింపు బాదుడు..


ఫిబ్రవరి నుంచి నవంబరుకు సంబంధించిన ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్‌ను వైద్యులు, పీజీలు, నర్సులు, టెక్నీషియన్లు, 4వ తరగతి ఉద్యోగుల ఖాతాల్లో వేసేందుకు ఆయా విభాగాలకు చెందిన అధికారుల నుంచి ఆరోగ్యశ్రీ అధికారులు జాబాతాను కోరారు. అయితే, నర్సుల లిస్టులు మినహా మిగిలిన అన్నీ సక్రమంగానే అందజేశారు. నర్సుల విషయంలో మాత్రం కొత్తవారు 130 మందిని మినహాయించి 264 మంది పాతవారి పేర్లతో ఉన్న లిస్టును మాత్రమే పంపించారు. 247 మంది స్టాఫ్‌ నర్సులు(Staff nurses), ఇన్‌చార్జి నర్సుల ఖాతాల్లోకి అలెవెన్సులను బదిలీ చేశారు. లిస్టులో ఉన్నవారిలో 17 మందికి వివిధ కారణాలతో నిలిపివేశారు.


city5.2.jpg

147 మందికి ఎలాంటి అలెవెన్సులూ రాలేదు. మొత్తం 394 మందికి చెల్లించాల్సిన నగదును కేవలం 247 మందికి పంచేశారు. 147 మంది నర్సుల్లో ఒక్కొక్కరికి రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు మొత్తం రూ. 25 లక్షల వరకు రావాల్సి ఉండగా అదంతా ఇతరుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. పది నెలల క్రితం ఉస్మానియా ఆస్పత్రి నుంచి రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు బదిలీపై వెళ్లిన నర్సులతో పాటు బదిలీపై ఉస్మానియాకు వచ్చిన నర్సుల ఖాతాల్లోకి ఈ డబ్బులను జమ చేశారు. ఈ విషయమై పలువురు నర్సులు ఆరోగ్యశ్రీ సెక్షన్‌ అధికారులు, ఉస్మానియా అధికారులను ప్రశ్నించగా వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు అలవెన్సులను ఇవ్వాలని బాధిత నర్సులు డిమాండ్‌ చేస్తున్నారు.


130 మంది నర్సుల లిస్ట్‌ ఇవ్వలేదు

మే నెల నుంచి నవంబరు వరకు మాత్రమే ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్‌ను పంపిణీ చేశాం. ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్‌కు సంబంధించి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ నుంచి 264 మందికి సంబంధించిన నర్సుల లిస్టును మాత్రమే మాకు పంపించారు. మరో 130 మంది పేర్లను పంపించలేదు. లిస్టు ప్రకారం ఇంకా 17మంది నర్సులకు మాత్రమే వివిధ కారణాలతో అలెవెన్సులు నిలిచిపోయాయి. త్వరలో అవి కూడా క్లియర్‌ చేస్తాం.

- కల్యాణ్‌, ఉస్మానియా ఆస్పత్రి ఆరోగ్యశ్రీ సెక్షన్‌ ఇన్‌చార్జి


ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు మెట్రో!

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2025 | 08:30 AM