Share News

Actress VishnuPriya: నటి విష్ణు ప్రియకు హైకోర్టులో ఎదురు దెబ్బ

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:51 PM

Actress VishnuPriya: బెట్టింగ్ యాప్స్ కేసులో నటి విష్ణు ప్రియకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరించాలని ఆమెను హైకోర్టు ఆదేశించింది. అలాగే చట్ట ప్రకారం ఈ కేసులో ముందుకు వెళ్లాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు సూచించింది.

Actress VishnuPriya: నటి విష్ణు ప్రియకు హైకోర్టులో ఎదురు దెబ్బ

హైదరాబాద్, మార్చి 28: బెట్టింగ్ యాప్‌ల కేసులో నటి విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మియాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ ఆమె హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. ఎఫ్ఐఆర్‌ కొట్టేసేందుకు.. అలాగే ఈ దర్యాప్తుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.

అంతేకాకుండా..ఈ కేసులో పోలీసులకు సహకరించాలని విష్ణు ప్రియను హైకోర్టు ఆదేశించింది. అలాగే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం చేసిన పలువురు నటులు, ఇన్‌ఫ్లూయన్సర్లపై మియాపూర్‌తోపాటు పంజాగుట్ట పోలీసులు పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. బెయిల్ పొందేందుకు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 03:51 PM