CM Revanth: సీఎం రేవంత్ జిల్లాల బాట.. వాటిపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jan 11 , 2025 | 01:58 PM
CM Revanth Reddy: కొత్త పథకాల అమలుపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. సంక్రాంతి తర్వాత పథకాల పై స్పీడ్ పెంచేలా ప్లాన్ సిద్ధం చేశారు. రైతు భరోసా, భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. పథకాలు పారదర్శకంగా అమలయ్యేలా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, జనవరి 11: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రవాణా, గృహజ్యోతి, రైతు రుణమాఫీ పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. కొత్త పథకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పథకాలకు సంబంధించి సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణ సీఎం. అందుకు కోసం జనవరి 26 తర్వాత జిల్లాల బాట పట్టనున్నారు. జిల్లాలో తిరుగుతూ.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త పథకాల అమలుపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. సంక్రాంతి తర్వాత పథకాల పై స్పీడ్ పెంచేలా ప్లాన్ సిద్ధం చేశారు. రైతు భరోసా, భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు.
పథకాలు పారదర్శకంగా అమలయ్యేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. కీలక పథకాలకు నిధుల కొరత లేకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే రైతు భరోసా కోసం రూ.8 వేల 6 వందల కోట్లను సిద్దం చేసింది సర్కార్. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. జనవరి 26 నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం అందజేయనున్నారు. దీని ద్వారా దాదాపు 12 లక్షల మంది భూమిలేని వ్యవసాయ కూలీలకు లబ్ది చేకూరనుంది.
అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. కోర్టు కీలక ఉత్తర్వులు
వీటితో పాటు జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. గత పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో అనేక మంది పేదలు ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి. వారి కోరిక నెరవేరేలా జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్‌కు సీఎం సూచనలు చేశారు. ‘‘జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు వస్తా.. ఆకస్మిక తనిఖీలు చేస్తాను’’ అంటూ అధికారులు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
Sankranti: సంక్రాంతి పండుగ వేళ.. ఆ బస్సులపై అధికారుల నిఘా
TG News: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News And Telugu News