Share News

CM Revanth Reddy: మద్యం సరఫరాకు ఆ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Jan 11 , 2025 | 09:56 PM

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

CM Revanth Reddy: మద్యం సరఫరాకు ఆ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్‌(TGBCL)కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని సీఎం సూచించారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజులపాటు నిర్ణీత గడువు ఇవ్వాలని చెప్పారు. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకుంటే కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.


హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపునపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Flight Prices: ప్రయాణికులకు షాక్.. హైదరాబాద్ టూ విశాఖపట్నం టిక్కెట్ ధర రూ. 35 వేలు..

Dil Raju: నా ఉద్దేశం అదికాదు.. తప్పుగా అనుకోవద్దు

Updated Date - Jan 11 , 2025 | 09:57 PM