KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై
ABN , Publish Date - Mar 27 , 2025 | 06:26 PM
KTR: రైతు బంధు పథకం సరైన రీతిలో అమలు కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏక్కడైనా 100 శాతం ఈ పథకం అమలు అయిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. అందుకోసం కొడంగల్ లేకుంటే సిరిసిల్లలో పర్యటిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాయిస్ ఇచ్చారు.

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సిరిసిల్ల, కొడంగల్.. ఏ నియోజకవర్గానికైనా వెళ్తామంటూ ఛాయస్ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వదిలేశారు. ఏ గ్రామంలోనైనా 100 శాతం రైతు బంధు పూర్తయిందని నిరూపిస్తారా? అంటూ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. నిరూపిస్తే రాజకీయల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ స్పష్టం చేశారు రైతుబంధు ఆపిందే కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పైగా తమపై ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ అధికార పక్ష నేతలపై మండిపడ్డారు. అప్పులు పుట్టడం లేదంటూనే భారీగా అప్పులు చేస్తున్నారంటూ రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ చురకలంటించారు. కొత్త టెండర్లకు డబ్బులున్నాయి కానీ.. గ్యారంటీల అమలుకు మాత్రం నగదు లేదా? అని రేవంత్ ప్రభుత్వాన్ని సభ సాక్షిగా నిలదీశారు.
రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు వెళ్లారని కేటీఆర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంపై డ్రోన్ ఎగరేస్తే ఊరుకుంటారా? అని సందేహం వ్యక్తం చేశారు. కుటుంబాలు మీకే ఉంటాయా? మాకు ఉండవా? అని ప్రభుత్వంలోని పెద్దలను కేటీఆర్ నిలదీశారు. ఒకరిని జైలుకు పంపే అధికారం ముఖ్యమంత్రికి ఉండదని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. నేరాలు నిర్దారించేది, జైలుకు పంపేది కోర్టులు మాత్రమేని ఈ సందర్భంగా కేటీఆర్ సభలో స్పష్టం చేశారు. ఓ వైపు కక్ష సాధింపులు లేవంటున్నారు.. అయినా తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పలు పథకాలను ఎందుకు ఆపారని ప్రభుత్వాన్ని బల్లగుద్ది మరి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు వీళ్లను గోల్డ్ అనుకున్నారని.. కానీ వీళ్లు రోల్డ్ గోల్డ్ అంటూ కాంగ్రెస్ నేతలను కేటీఆర్ వ్యంగ్యాంగా విమర్శించారు. ఫార్మా సిటీపై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతులకు పెట్టుబడి సాయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా రైతులందరికి పెట్టుబడి సాయం చేశామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఈ సాయం అందరికి అందలేదంటూ ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో కానీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కానీ పర్యటిద్దాం. ఈ రెండు నియోజకవర్గాల్లో రైతులకు రైతు బంధు సాయం నగదు అందినట్లు రుజువు అయితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
మరోవైపు ఎన్నికల సందర్భంగా పలు హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అమలు చేయడం లేదంటూ అధికార కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో అన్ని పథకాలు వల్ల ప్రజలు లబ్ది పొందుతున్నారన్నారు. అలాగే గత బీఆర్ఎస్ పాలనలో రూ. లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..
Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి
Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్
LRS : ఎల్ఎస్ఆర్ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..
ఈ పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..?
For Telangana News And Telugu News