Share News

Fire Accident: బాలానగర్‌లో అగ్ని ప్రమాదం..

ABN , Publish Date - Feb 03 , 2025 | 07:46 AM

హైదరాబాద్: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలానగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక గాంధీనగర్‌లో సూర్య తేజ ఇండస్ట్రీస్, లిఫ్ట్ గ్రిల్స్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి.

Fire  Accident: బాలానగర్‌లో అగ్ని ప్రమాదం..
Fire Accident

హైదరాబాద్: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accidens) నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలానగర్‌ (Balanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక గాంధీనగర్‌లో సూర్య తేజ ఇండస్ట్రీస్, లిఫ్ట్ గ్రిల్స్ తయారీ కంపెనీలో (Surya Teja Industries, Lift Grills Manufacturing Company) మంటలు చెలరేగాయి. కంపెనీ సిబ్బంది గ్రిల్స్‌కు పెయింట్ వేసిన తర్వాత కంపెనీ షెట్టర్లు మూసివేసి వెళ్ళి పోయారు. సార్ట్ సర్క్యూట్‌ (Sort circuit)తో మంటలు చెలరేగినట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఏ మేరకు ఆస్థి నష్టం జరిగింది తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

కాగా పాతబస్తి, కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఆదివారం తెల్లవారుజామున ఓ భవనంలోని సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కిషన్ బాగ్ కార్పరేటర్ సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలో ఉన్న వారిని పోలీసులు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల భవనం పై అంతస్తులోనూ దట్టమైన పొగ అలుముకుంది. బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే దగ్గరుండి సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఈ వార్త కూడా చదవండి..

బాసరలో కిటకిట లాడుతున్న క్యూ లైన్లు..


జీడిమెట్లలో అగ్ని ప్రమాదం.. వ్యక్తి మృతి..

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరి సంజీవయ్య కాలనీలోని ఓ ఇంటిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. జలగం సాయి సత్య శ్రీనివాస్ (32) ఇంటిలో మంటలు చెలరేగడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్, రాజమండ్రికి చెందిన సత్య శ్రీనివాస్, పటాన్‌చెరు, రుద్రారంలోని ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు అగ్నికి ఆహుతయ్యాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్‌ సుంకాల కొరడా

మనమ్మాయిల మరో ప్రపంచం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 03 , 2025 | 07:46 AM