Fire Accident: మహేంద్ర షో రూమ్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 24 , 2025 | 10:19 AM
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్‌లోని మహీంద్రా షో రూమ్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

హైదరాబాద్: మాదాపూర్ (Madhapur) పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం (Big Fire Accident) జరిగింది. ఈ ఘటనలో ఖరీదైన 12 వాహనాలు (12 vehicles) కాలి బూడిదయ్యాయి. ఎక్స్‌యువి 700 మూడు బ్లాక్ కలర్, వైట్ కలర్ మూడు, ఎక్స్‌యువి 3 ఎక్స్ ఓ మూడు వాహనాలు, బ్లూ, రెడ్, వైట్, ఆర్వో ఎక్స్, ఎక్స్ బ్లాక్ ఒక వెహికల్, తార్ వాహనం, బొలెరో నియో ఎక్స్ ఈవి9, బీఈ6 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సకాలంలో దగ్గర ఉన్న ఎంప్లాయిస్ షోరూమ్ వద్దకు చేరుకొని నాలుగు వెహికల్స్‌ను బయటకు తీసుకువచ్చారు. ఆ వాహనాలకు ఎటువంటి డామేజ్ జరగలేదు. పక్కనే ఉన్న సహర్ష్ ఓయో రూమ్‌కు మంగలు వ్యాపించకుండా ఫైర్ సబ్బంది (Fire Fighter) మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ వార్త కూడా చదవండి..
అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం..
మహేంద్ర షో రూమ్ పక్కనే స్కోడా కార్ల షోరూం ఉంది. ఆ షో రూమ్‌కు కూడా మంటలు వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మహీంద్రాకి చెందిన వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాం మొత్తం అగ్నికి ఆహుతి అయింది. ఒక్క గోదాములో ఉండే మెటీరియల్ నాలుగు కోట్ల పైమాటే. షోరూం మొత్తం కాలిపోవడంతో షోరూమ్‌లో పనిచేసే సిబ్బంది కన్నీరు మున్నీరవుతున్నారు. దాదాపు పది కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. స్పేర్ పార్ట్స్ గోదాము నుండే మంటలు వ్యాప్తి చెందినట్టు పోలీస్ అధికారులు గుర్తించారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో షోరూం వెనుక భాగం ఉన్న గోదాము కూలిపోయిన చోట మరోసారి మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
కొండాపూర్‌లోని రోజువారీ మాదిరిగానే మహేంద్ర షోరూమ్ కు గురువారం రాత్రి 10 గంటల అనంతరం సిబ్బంది తాళాలు వేసి వెళ్లిన క్రమంలో, లోపల నుండి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల గల దుకాణాల యజమానులు అప్రమత్తమై ఫైర్స్ సిబ్బందికి సమాచారం అందజేశారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో, ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు. షోరూం కు సెట్ బ్యాక్ లేకపోవడంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. షోరూంకు పక్కనే ఉన్న ఓయో రూమ్ కు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో ఓయో రూమ్ లో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంపై రంగారెడ్డి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కరీం మాట్లాడుతూ.. సుమారు 10 గంటల సమయంలో ఫైర్ స్టేషన్ కి కాల్ వచ్చిందని, వెంటనే మాదాపూర్ లో ఉన్న ఫైర్ ఇంజిన్ ను మహేంద్ర షో రూమ్ వద్దకు పంపించామన్నారు. మంటలు ఎక్కడ నుంచి చెలరేగాయో అర్థం కావడం లేదని తెలిపారు.
మహీంద్రా షోరూంలో కస్టమర్లకు చెందిన మూడు వెహికల్స్ కూడా అందులో ఉన్నట్లు, డెలివరీకి సిద్ధంగా ఉన్న మరొక వెహికల్ కూడా ఉంది. గోదాములో ప్లాస్టిక్ సామాగ్రి, థర్మాకోల్ ఫ్యాబ్రిక్ వస్తువులు ఉండడం వల్ల మంటల వ్యాప్తి పెరిగిపోయింది. అయితే మంటలు చెలరేగిన సమయంలో షోరూంలో సిబ్బంది ఎవరూ లేకపోవడం ప్రాణం నష్టం జరగలేదు. షోరూమ్ మొత్తం దగ్ధమైపోయింది. కాగా ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు భావిస్తున్నారు. షోరూంకు సెట్ బ్యాక్ లేకపోవడంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది అన్నారు. షోరూంకు పక్కనే ఉన్న ఓయో రూమ్‌కు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో ఓయో రూమ్‌లో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News